మెరిసే చర్మం కోసం సులువైన చిట్కాలు

Tips for shining skin

08:18 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Tips for shining skin

సరైన పద్ధతిలో చిట్కాలను వాడడం వలన చర్మం ఆరోగ్యవంతంగానూ మరియు ప్రకాశవంతంగానూ మారుతుంది. మెరిసే చర్మం కోసం బ్యూటీ పార్లర్‌ వెంట తిరగనవసరం లేదు. ఇంట్లో ఉంటూనే చర్మాన్ని నిగారించేలా చేసుకోవచ్చు. వీటికోసం వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు. సహససిద్ధమైన వాటితో ముఖాన్నినిగారించేలచేసుకోవచ్చు. ఎటువంటి రసాయనాలు వీటిలో ఉండవు అందువల్ల దుష్ప్రభావాలు సంభవించవు. మెరిసే చర్మం కోసం ఏమి చేయాలో కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

సౌందర్యానికి చిట్కాలు:

1. పాలు:

  • పాలు సౌందర్య సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. పొడిబారిన ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీ అని పాలను ఉపయోగిస్తారు. అంతకు ముందే పచ్చిపాలను కొంచెం మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి. కుదిరినప్పుడు ఆ పాలను ముఖానికి రాసుకోవాలి. కొంచెం సమయం తరువాత చల్లని నీటితో కడగాలి. రోజూ చేయడంవలన మీచర్మం నిగారిస్తుంది. పచ్చిపాలను వాడిచూడండి మంచి ఫలితం లభిస్తుంది.
  • ఒకవేళ మీదిజిడ్డు చర్మం అయితే కనుక చల్లటి మంచుగడ్డ కలిపిన పాలను ముఖానికి రాసుకోవడం వలన ఫలితం ఉంటుంది.

2. తేనె:

తేనె మంచి ఔషదంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగానూ మరియు కాంతివంతంగానూ చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో మొదటి పాత్ర వహిస్తుంది. ఇది చర్మం పై మచ్చలను, మొటిమలను తగ్గిస్తుంది. దీనిలోయాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందువల్ల చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంతో ప్రదాన పాత్ర వహిస్తుంది పాలు చర్మాన్ని సున్నితంగా చేస్తుంది.

  • కొంచెం తేనెని చేతిలోకి తీసుకొని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడంవలన మంచి నిగారించే చర్మం లభిస్తుంది.

3. దోసకాయ:

దోసకాయ కూడా చెప్పుకోదగ్గ ఫలితాలను ఇస్తుంది. తాజా దోసకాయ కళ్ళకింద నల్లని వలయాలను మాయం చేస్తుంది.అలాగే ముఖం మీద మచ్చలను కూడా ఇది పోగొడుతుంది.

  • తాజా దొసకాయరసాన్ని తీసుకొని దానిలో దూదిని ముంచి వాటిని కంటి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి.
  • ఇది హైడ్రేటింగ్‌ భావనను కలిగిస్తుంది.
  • ఇది కొన్ని రోజుల పాటు చేయడం వలన కంటి కింద నల్లని వలయాలు మాయం అవుతాయి.

4. సౌందర్యానికి నూనెలు:

ఆలివ్‌ ఆయిల్‌, బాదం నూనె, కొబ్బరి నూనె ఇవి సౌందర్యానికి మెరుగులు అద్ధుతాయి.ఇవి వాడడం వలన శరీరం నిగనిగలాడుతుంది.ఇవి ముఖానికే కాకుండా శరీరం అంతా రాసుకోవచ్చు శరీరాన్ని పొడి బారిపొకుండా చూసుకుంటాయి.

  • పడుకునేముందు ముఖానికి ఆయిల్‌ రాసుకొని పడుకోవాలి ఈ పద్ధతి చలి కాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మాన్ని పొడిబారనివ్వకుండా ప్రకాశవంతంగా నిగారించేలా చేస్తుంది.
  • నూనెలు వాడడం వలన శరీరం పై పడిన దుమ్ముదూళి శుభ్రం అవుతుంది. పరిశుభ్రమైన చర్మం మీ సొంతం అవుతుంది.

5.టమాట:

  • టమాట రసాన్ని ముఖానికి రాసుకోవడం వలన ఇది బ్రీచింగ్‌ లాగా పనిచేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
  • టమాటాని ఉడకబెట్టి దాని నుండి వచ్చిన రసాన్ని చల్లారనివ్వాలి. ఆరసంతో ముఖం కడుక్కోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

English summary

Tips for shining skin. Everybody wants fair and shiny skin. Follow these 5 steps you get shining skin naturally.