బట్టతల తో బాధ పడుతున్నారా?

Tips for to get rid of baldness

06:35 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Tips for to get rid of baldness

జుట్టు పెరుగుదల లేకపోవడం,పాక్షికంగా లేదా పూర్తిగా జుట్టు కోల్పోతే బట్టతల వస్తుంది. పురుషులలో సుమారుగా 70 శాతం మంది బట్ట తల సమస్యతో బాధపడుతున్నారు. పురుషులలో జుట్టు ఎక్కువగా రాలిపోవటం కారణంగా బట్ట తల వస్తుంది. బట్ట తల రావటానికి వంశపారంపర్యం లేదా పురుష  సెక్స్ హార్మోన్లు ప్రధాన కారణంగా ఉన్నాయి. జుట్టు రాలటం ప్రారంభం అయితే క్రమంగా జుట్టు పలుచగా తయారయ్యి తద్వారా బట్ట తలగా మారుతుంది. బట్ట తలను నివారించటానికి సమర్ధవంతమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

1/16 Pages

1. కొబ్బరి పాలు మరియు నూనె

బట్ట తల మరియు జుట్టు రాలటాన్ని నివారించటానికి ఉత్తమ ఇంటి పరిష్కారంగా కొబ్బరి పాలను చెప్పవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా కొబ్బరి పాలను తలకు రాస్తే మంచి పలితం కనపడుతుంది.

* ఒక బౌల్ లో 20 ml కొబ్బరి నూనె ,10 ml ఉసిరి నూనె, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి తల మీద చర్మం మీద రాసి కొంత సేపు అలా వదిలేయాలి.
* అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇది చుండ్రు నివారణ  మరియు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది.
* ప్రతి రోజు క్రమం తప్పకుండా జుట్టుకు పాలను రాస్తే తల మీద చర్మానికి సహజమైన పోషణను అందించటమే కాక జుట్టు కణజాలంనకు కూడా పోషణను అందిస్తుంది.

English summary

The main reason for baldness is heredity or male sex hormones. The hairline gradually recedes and the hair becomes finer and thinner. It can be effectively reduced through certain home remedies.