పంటినొప్పికి ఉపశమనం

Tips for Tooth sensitivity and Toothache

12:20 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Tips for Tooth sensitivity and Toothache

పంటి నొప్పితో బాధపడుతున్నారా? చల్లని పదార్థాలు, పులుపు తినలేకపోతున్నారా? అయితే దిగులు చెందకండి. ఇంట్లో ఉంటూనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు వాటివల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి పంటి నొప్పి కేవిటీస్‌, ఇన్ఫెక్షన్‌, పంటి ద్వారం తెరుచుకుని ఉండడం వలన, విరిగిన పళ్ళు, చిగురు సమస్యలు ఇలాంటి వాటివల్ల సంభవిస్తాయి. ఈ సమస్యలను దూరం చేయడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో చూద్దాం.

ఇంటి చిట్కాలు

1. మిరియాలు మరియు ఉప్పు

మిరియాలు, ఉప్పు కలిపి వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉండటం వలన సమర్ధవంతంగా పనిచేస్తుంది.

 • మిరియాలు పొడి మరియు ఉప్పు సమపాళ్ళలో తీసుకోవాలి.
 • దాంట్లో కొన్ని చుక్కలు నీళ్ళు వేసి పేస్ట్‌లాగా చేయాలి.
 • ఈ పేస్ట్‌ని దెబ్బతిన్న పళ్ళకి రాసి కొంచెం సేపు ఆరనివ్వాలి.
 • ఇలా రోజుకి పలుసార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

2. వెల్లుల్లి

పంటి నొప్పికి వెల్లుల్లి బాగా ఊరటనిస్తుంది. దీనిలో యాంటీ బయోటిక్‌ గుణాలు ఉన్నాయి. ఇది మంచి ఔషధ గుణాలు కలది. ఇది పంటి నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

 • వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకుని అందులో కొచెం ఉప్పు కలిపి నొప్పికి గురైన పంటి మీద ఈ పేస్ట్‌ని ఉంచాలి.
 • ఇలా చేయడం వలన పంటి నొప్పి పోతుంది.
 • ఒకటి లేదా రెండు లవంగాలను నమలడం వల్ల కూడా చక్కటి విముక్తి కలుగుతుంది.
 • ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

3. లవంగాలు

లవంగాలు యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ మరియు యాంటీసెప్టిక్‌ గుణాలు కలిగి ఉండటం వలన ఇది పంటి నొప్పిని తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్‌కి కారణమైన క్రిములతో పోరాటం చేస్తుంది.

 • రెండు లవంగాలను మొత్తం బాగా మెత్తగా రుబ్బాలి.
 • దీనిలో ఆలివ్‌ ఆయిల్‌ లేదా వెజిటబుల్‌ ఆయిల్‌ను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బాధిస్తున్న పళ్ళపై రాయాలి.
 • మరొక పద్ధతి కూడా ఉంది. మార్కెట్‌లో దొరికే లవంగాల ఆయిల్‌ని కూడా వాడవచ్చు. దూదిని అందులో ముంచి బాధ కలిగించే పంటిపై ఉంచడం వలన మంచి ఫలితం ఉంటుంది లేదా కొన్ని చుక్కల లవంగాల నూనెలో అరగ్లాసు నీటిని వేసి ఆ మిశ్రమాన్ని మౌత్‌వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు.

4. ఉల్లిపాయలు

ఉల్లిపాయలలో యాంటీసెప్టిక్‌ మరియు యాంటి మైక్రోబియల్‌ గుణాలు ఉంటాయి. ఇది పంటినొప్పిని అరికడుతుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్‌కి గురైన క్రిములను కూడా చంపుతుంది.

 • పంటినొప్పి వస్తుంది అని సూచన రాగానే ఉల్లిపాయ ముక్కలు చేసుకుని వాటిని నమలాలి. దానివల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
 • 5. వేడినీళ్ళు మరియు ఉప్పు
 • వేడినీటిలో ఉప్పు వేసుకుని నోటిని శుభ్రం చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇది పంటి నొప్పిని, చిగురువాపు, బ్యాక్టీరియాని అరికడుతుంది.
 • అరస్పూన్‌ ఉప్పు, ఒక గ్లాసు వేడినీళ్ళు తీసుకుని ఉప్పు కరిగే వరకు బాగా కలపాలి.
 • తరువాత ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

6. జామ ఆకులు

జామ ఆకులు పంటి సమస్యలకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి నోటి దుర్వాసనను కూడా అరికడతాయి. దీనిలో యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు ఉండటం చేత ఇది పంటి సమస్యలను దూరం చేస్తుంది.

 • ఒకటి లేదా రెండు జామ ఆకులను బాగా నమలాలి. దాని నుండి వచ్చే రసం బాధ కలిగించే పంటి మీద బాగా పనిచేసి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 • ఇదే విధంగా పాలకూర నమలటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
 • 4 జామ ఆకులను తీసుకుని నీటిలో వేసి వేడి చేసి అనంతరం ఆ నీటిని చల్లార్చి దానిలో కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఆ వచ్చిన నీటిని మౌత్‌ వాష్‌లాగా వాడాలి.

ఈ మూడింటిలో ఏది వాడినా మంచి ఫలితం ఉంటుంది.

7. ఐస్‌క్యూబ్స్‌

ఐస్‌క్యూబ్స్‌ వల్ల కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 • పలుచటి వస్త్రంలో చిన్న ఐస్‌ముక్కను తీసుకుని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో బుగ్గ మీద కొద్ది నిమిషాలపాటు ఉంచాలి.

ఇన్ని విధాలుగా పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. బాగా ప్రమాదకరం అయ్యే వరకు ఉండకుండా ఎన్నివాడినా తగ్గకపోతే కనుక పళ్ళు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

English summary

Tips for Tooth sensitivity and Toothache. If you have toothache, it is the best to seek immediate advice from a dentist before the problem worsens