మీ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా..

Tips To Follow Before Exchange Of Phone

04:03 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Tips To Follow Before Exchange Of Phone

రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. గంట గంటకు ఓ కొత్త యాప్, అప్ డేట్ అందుబాటులోకి స్తున్నాయి. దీంతో చాలా మంది మూడు నెలలు, ఆరు నెలలకే ఫోన్ మార్చేస్తున్నారు. మరికొందరు పాత ఫోన్ తో విసుగెత్తిపోయి కొత్త ఫోన్ కోసం దాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకునే ముందు కొన్ని విషయాలను తప్పకుండా గమనించాల్సిందే.

మీరు ఆ ఫోన్లో మీ బ్యాంకు ఖాతాలు, పాస్ వర్డ్ లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు, కీలకమైన మెయిల్ లను వాడి ఉంటే.. ఆ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే హ్యాకర్లు ఇప్పుడు మొబైల్ ఫోన్లనే టార్గెట్ చేసుకున్నారు. మీరు ఆ ఫోన్ ను ఫార్మాట్ చేసేసినప్పటికీ.. అందులోని అణువణువూ గాలించి కోడ్ లను క్రాక్ చేసి మీరు డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. హ్యాకర్లు ప్రధానంగా ఎక్స్ఛేంజ్ ఫోన్ల పైనే ఇప్పుడు కన్నేశారు. ఈ ఫోన్లయితే చాలా ఈజీగా సమాచారం పొందడానికి అవకాశముంటుందని ఓ టెక్నాలజీ నిపుణుడు తెలిపారు.

ఎక్స్ఛేంచ్ చేసుకున్న ఆ ఫోన్లలో వాడిన ఫోన్ బ్యాంకింగ్, ఈ-షాపింగ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పాస్ వర్డ్ లు, ఫొటోలు, వీడియోలకు సంబంధించిన విలువైన సమాచారం ఇప్పుడు చాలా సులభంగా హ్యాకర్లకు దొరికేస్తోందని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ డైరెక్టర్ సందీప్ గుప్తా చెప్పారు. ‘‘మీరు ఫోన్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మెమరీ నుంచి డేటా డిలీట్ చేసినప్పటికీ.. సైబర్ నేరగాళ్లు వాటిని చాలా సులభంగా తిరిగి పొందగలుగుతున్నారు. అది కొత్త మోడల్ అయినా.. పాత మోడల్ అయినా ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడమంటే చాలా పెద్ద తప్పుచేస్తున్నట్టేనని చెప్పాలి’’ అని ఆయన అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఫోన్ మార్పిడి చేసుకోవాలని అనుకుంటే.. అందులో డేటాను డిలీట్ చేయడానికి బదులు దాంట్లో వేరే డేటాను ఓవర్ రైట్ చేయడం మనం తీసుకోదగని ముందు జాగ్రత్త అని ఆయన సలహా ఇస్తున్నారు.

English summary

When we want to exchange smart phone then we have to follow the following steps like deleting of accounts,phone passwords,personnal photos deletion etc