నోటి కార్నర్ లో(పెదాల మూల) పగుళ్ళకు చిట్కాలు

Tips for cracked corner of mouth

02:52 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Tips for cracked corner of mouth

పెదాల మూలల్లో పగుళ్ళు అనేవి చాలా బాధకరంగాను మరియు చాలా ఇబ్బందికరమైన సమస్య అని చెప్పవచ్చు. ఈ సమస్య ఇన్ఫెక్షన్ లేదా ప్రాణాంతక సమస్య కానప్పటికీ చాలా బాధగా ఉంటుంది. ఈ సమస్య కారణంగా తినటానికి, త్రాగటానికి, మాట్లాడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎరుపుదనం,బొబ్బలు ఉండుట వలన చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ సమస్యకు  పొడి చర్మం, అనేక వైరల్ లేదా శిలీంధ్ర వ్యాధులు,ఇనుము మరియు జింక్ వంటి ఖనిజాల లోపం,అలెర్జీ, వాతావరణంలో మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. మనం ఈ పగుళ్ళకు కొన్ని ఇంటి నివారణల ద్వారా ఉపశమనం పొందవచ్చు.

1/6 Pages

1. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె నోటి కార్నర్ లో(పెదాల మూల) పగుళ్ళను తగ్గించటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో సమృద్దిగా నీరు, సంతృప్త కొవ్వులు, వివిధ కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలు ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఇది చర్మానికి తేమను కలిగించి పగుళ్ళు తగ్గటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

English summary

Here are some home remedies for cracked corner of lips. Treat cracked corner of mouth promptly before they turn chronic. You will be happy to know that there are various home remedies to treat cracked corner of lips.