తిరుచానూరు అమ్మవారికి చేసే సేవలు తెలుసుకోండి

Tiruchanur Padmavathi Temple Timings and Seva Details

12:36 PM ON 20th October, 2016 By Mirchi Vilas

Tiruchanur Padmavathi Temple Timings and Seva Details

తిరుపతి పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు ఉంటుంది. ఇక్కడ శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవేరి అయిన శ్రీ పద్మావతీ అమ్మవారు కొలువై ఉన్నారు. తిరుచానూరుకే అలవేలు మంగాపురం అనే పేరు కూడా ఉంది. పద్మావతీ అమ్మవారు శ్రీలక్ష్మీదేవీ అవతారంగా చెబుతారు. ఆలయం సమీపంలో పద్మ సరోవరం అనే పుష్కరిణి ఉంది. కార్తీక మాసంలో శుక్ల పంచమి తిథి రోజున ఇదే పుష్కరిణిలో బంగారు పద్మంలో అమ్మవారు ప్రత్యక్షమైనట్టు భావిస్తారు. ఈ విశిష్టతను పురస్కరించుకుని ఏటా కార్తీక మాసంలో పద్మావతీ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఇదే పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది. అదే రోజున లక్షలాదిగా భక్తులు పుష్కరిణలో పవిత్ర స్నానం కోసం తరలివస్తారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే శ్రీకృష్ణ స్వామి, శ్రీ సుందరరాజస్వామి ఆలయాలను సైతం చూడవచ్చు. పద్మసరోవరం ఎదురుగా సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. అమ్మవారికి జరిగే సేవలు ఇలా ఉంటాయి.

1. సుప్రభాతం ప్రతి రోజు ఉదయం 5 గంటలకు. శుక్రవారాల్లో 3.30గంటలకు జరుగుతుంది. ఒక టికెట్ పై ఒకరికి ప్రవేశం.
2. సహస్ర నామార్చన ప్రతి రోజు ఉదయం 5.30 గంలకు. శుక్రవారాల్లో 4గంటలకు.
3 పద్మావతీ పరిణయం అమ్మవారికి జరిగే కల్యాణం. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ఒక టికెట్ పై దంపతులకు ప్రవేశం.
4. ఊంజల్ సేవ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకు. శుక్రవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు.
5. కుంకుమార్చన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది.


6. ఏకాంత సేవ రోజూ రాత్రి 9 గంటలకు.
7. అష్టదళ పాదపద్మారాధన సోమవారం ఉదయం 6.45 గంటలకు
8. తిరుప్పావడ సేవ గురువారం ఉదయం 7 గంటలకు
9. అభిషేకం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు
10. ఉత్తరాషాడ నక్షత్రం రోజున లక్ష్మీపూజ ఉదయం 9 గంటలకు


11. సహస్ర దీపాలంకరణ సేవ ప్రతి శుక్రవారం సాయత్రం 5 గంటలకు
12. పుష్పాంజలి సేవ ప్రతి శనివారం ఉదయం 6.45 గంటలకు.
13. వస్త్రాలంకరణ సేవ ప్రతి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు
14. సహస్ర కలశాభిషేకం ప్రతి నెలా మొదటి బుధవారం 6.45 గంటలకు
15. వసంతోత్సవం ఏటా మే నెలలో


16. వరలక్ష్మీ వ్రతం ఏటా ఆగస్ట్ లో
17. పవిత్రోత్సవం ఏటా సెప్టెంబర్ లో
18. లక్ష కుంకుమార్చన ఏటా నవంబర్ లో
19. గజవాహన, గరుడ వాహన సేవలు బ్రహ్మోత్సవాల సమయంలో
20. పుష్పయాగం పంచమీతీర్థం మరుసటి రోజుదర్శనాలు
21. సర్వదర్వనం, ప్రత్యేక దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేకానంతర దర్శనం (శుక్రవారం మాత్రమే), వేద పండితులతో ఆశీర్వచనం అందుబాటులో ఉన్నాయి.

English summary

Tiruchanur Padmavathi Ammavari Temple Timings and Seva Details.