ఎమ్మెల్యేనని చెప్పి, తిరుమలలో మోసం - అరెస్టు

Tirumala special ticket fraud

01:18 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Tirumala special ticket fraud

నకిలీ పోలీసులు , నకిలీ జర్నలిస్టులు ... ఈ మధ్య కాలంలో నకిలీల బెడద పెరిగిపోయింది. అయితే నకిలీ ఎం ఎల్ ఏ వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. ఎమ్మెల్యేనంటూ ఓ వ్యక్తి తనకు తెలిసిన దళారీతో కలిసి తిరుమలలో మోసానికి పాల్పడ్డాడు. శ్రీవారి అర్చన, వీఐపీ బ్రేకు (ఎల్ -1) టికెట్లను పొందినట్లు తేలడంతో పోలీసులు శుక్రవారం వారిద్దరినీ అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి, శ్రీవారి దర్శనార్థమై తన సిఫారసు ఉత్తరాన్ని తన అనుచరుడైన బి. వెంకటేష్ కి ఇచ్చి బుధవారం తిరుమలకు పంపాడు. కానీ అతడు.. తనకు పరిచయస్తుడైన నగరికి చెందిన దళారీ డి.వెంకటేష్ కు విషయం తెలియజేసి, తిరుమలకు రప్పించాడు. వారు తమ వద్ద ఉన్న సిఫారసు ఉత్తరాన్ని కలర్ జెరాక్స్ తీశారు. ఈ ఉత్తరాన్ని ఉపయోగించి ఎమ్మెల్యే స్వయంగా వస్తున్నారని గురువారానికి మూడు అర్చన, ఎనిమిది వీఐపీ బ్రేకు (ఎల్ -1) దర్శన టికెట్లకు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత నర్సారావుపేటకు చెందిన వెంకటేష్ తానే ఎమ్మెల్యేనని చెప్పి జేఈవో కార్యాలయంలో ఈ టికెట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన తనిఖీల్లో వెంకటేష్ ఇచ్చిన ఉత్తరం నకిలీదని గుర్తించారు. ఈ విషయాన్ని సిబ్బంది విజిలెన్స వింగ్ విభాగానికి తెలియజేసేలోపు వారిద్దరితోపాటు కుటుంబసభ్యులు, గుంటూరుకు చెందిన మరో ముగ్గురితో కలిసి అర్చన, ఎల్ -1 దర్శనాలను పూర్తి చేసుకున్నారు. విజిలెన్స్ విభాగం ఇద్దరు వెంకటే్ షలను అదుపులోకి తీసుకొని విచారించగా మోసాన్ని అంగీకరించారు. వెంటనే వీరిద్దరినీ వనటౌన పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదుచేసి రిమాండుకు పంపారు.

ఇది కూడా చూడండి: మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నారా ?

ఇది కూడా చూడండి: కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి: ఇంట్లో ఉంచకూడని 8 పెయింటింగ్స్

English summary

Tirumala tirupathi special VIP break tickets fraud those people arrested by police.