నేత్ర పర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు(ఫోటోలు)

Tirumala Srivari Brahmotsavam

12:15 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Tirumala Srivari Brahmotsavam

తిరుమల శ్రీవారు అంటేనే అందరికీ ఎంతో ఇష్టం.. ఎన్నిసార్లు చూసినా తనివితీరదు... అందుకే ప్రతిరోజూ తిరుమల కొండ భక్తజనంతో అలరారుతోంది. ఇక దసరా వస్తే చాలు, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందడి మొదలవుతుంది. ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. బ్రహోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. సోమవారం ధ్వజారోహణతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను తిలకించేందుకు తరలివచ్చే భక్తకోటి కోసం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

1/9 Pages

1. రెండు కళ్ళూ చాలవన్నట్లు...


ఆహా తిరుమల క్షేత్రాన్ని వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవన్నట్లు విద్యుద్దీపాలంకరణ, రంగురంగుల విరుల తోరణాలతో, అరటి, మామిడాకులతో సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల వైభవం వర్ణించనలవి కాదన్నట్లు వుంది. దేవతల ప్రతిమలను విద్యుత్తు వెలుగులతో రూపొందించింది. సోమవారం నుంచి ఈనెల 11 వరకు బ్రహ్మోత్సవ వైభవం కొనసాగనుంది.

English summary

Tirumala Srivari Brahmotsavam