ఇక శ్రీవారి దర్శనం గంటలోనే

Tirumala Tirupati Devasthanam preview in one hour

06:13 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Tirumala Tirupati Devasthanam preview in one hour

గంటల కొద్దీ వేచి ఉంటే గానీ జరగని 'తిరుమల శ్రీవారి' దర్శన భాగ్యం ఇప్పుడు గంటలోనే భక్తులకు లభిస్తోంది. తిరుమలలోని కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు, అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శ నంతో పాటు కాలినడక భక్తులకు గంటలోనే దర్శనభాగ్యం లభిస్తోంది. నిన్న శ్రీవారిని 56,069 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2 కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది. విద్యార్ధులకు వేసవి సెలవలు, ఇంటర్ పరీక్షా ఫలితాలు రావడం వంటి పరిణామాల నేపధ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తనున్నారు.

English summary

Tirumala Tirupati Devasthanam preview in one hour. Now their is no queue in Tirumala Tirupati Devasthanam. It taking only one hour.