బెజవాడలో తిరుమల శ్రీవారు...

Tirumala Venkateswara Swamy in Vijayawada

12:07 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Tirumala Venkateswara Swamy in Vijayawada

కృష్ణా పుష్కరాలలో వచ్చే యాత్రికులకు తిరుమల శ్రీవారు బెజవాడలో కొలువు దీరాడు. నడుమ స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్మించిన నమూనా ఆలయంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల ఆదివారం ఉదయం శ్రీవారు కొలువు తీరారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించింది. వైఖానస ఆగమోక్తంగా అర్చక స్వాములు బలిహరణ, వివిధ పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 8.40 గంటల భక్తులకు స్వామి దర్శనానికి అనుమతించారు. టీటీడీ ఈవో సాంబశివరావు, సంయుక్త ఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

1/3 Pages

ఈ సందర్భంగా టీటీడీ ఈవో సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. విజయవాడ, పరిసర ప్రాంతాల భక్తులు నమూనా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా పుష్కరాల ప్రారంభానికి ఐదు రోజుల ముందుగానే ఆలయాన్ని సిద్ధం చేశామన్నారు. స్వామి వారిని దర్శిం చుకునేందుకు వచ్చే భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ, స్వామి వారి చిన్న ఫొటో కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

English summary

Tirumala Venkateswara Swamy in Vijayawada