తిరుమల శ్రీవారికి నిర్వహించే సేవలివే..

Tirumala Venkateswara Swamy sevas

11:50 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Tirumala Venkateswara Swamy sevas

తిరుమల శ్రీవారికి నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అన్నట్టు వైభవం ఉంటుంది. ముఖ్యంగా నాలుగు ప్రధాన వైష్ణవ ఆగమాల్లో ఒకటైన వైఖానస ఆగమం ప్రకారం తిరుమలలో వేంకటేశ్వరస్వామికి నిత్య, వార, పక్ష, మాస, వార్షిక సేవలు జరుగుతుంటాయి. వైఖానస ఆగమం రోజులో ఆరు సార్లు శ్రీవేకంటేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించాలని సూచించింది. ఆరోగ్యకరమైన జనాభా కోసం ప్రత్యూష కాలంలో, ప్రాత:కాలంలో, రాజ్యం కోసం మధ్యాహ్నం, దుష్ట శక్తుల నివారణకు అపరాహ్న సమయంలో, వ్యవసాయ ఉత్పాదన పెరిగేందుకు సాయంకాలం, పశు సంపద వృద్ధికి నిశి ఆరాధన అని మొత్తం ఆరు కాలాల్లోనూ పూజలను వైఖానస ఆగమం పేర్కొంది.

అయితే, ఆరు సార్లు పూజలు నిర్వహించడం వీలవక ప్రస్తుతం తిరుమలలో త్రికాలాల్లోనే పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తోమాల సేవ. దీన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తున్నారు. ఇది ఆర్జిత సేవ. మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున పూజలు జరుగుతుంటాయి. రాత్రి పూట గర్భగుడిలో స్వామి వారికి నిర్వహించే పవళింపు సేవలో అర్చక స్వాములు, పరిచారకులు, ఆచార్య పురుషులు మాత్రమే ఉంటారు. స్వామి వారికి అనునిత్యం కొన్ని రకాల ఆర్జిత సేవలు జరుగుతుంటాయి. ఈ సేవలను భక్తులు నిర్వహించుకోవచ్చు. వేకువజామున 3 గంటల తర్వాత సుప్రభాత సేవ ఉంటుంది.

స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలుపుతారు. తర్వాత తోమాల సేవ ఉంటుంది. తర్వాత అర్చన జరుగుతుంది. చివరిగా జరిగే ఏకాంత సేవకు భక్తులకు అనుమతి ఉండదు. వాటి గురించి విపులంగా తెలుసుకుందాం.

1/13 Pages

1. సుప్రభాతం...


స్వామి వారికి జరిగే తొట్ట తొలి సేవ ఇది. గర్భుగుడి లోపల శయన మండపంలో ఈ సేవ జరుగుతుంది. నిద్ర నుంచి స్వామి వారిని మేల్కొలుపుతారు. ఆచార్య పురుషులు బంగారు వాకిలి వద్ద ఉండి కౌసల్యా సుప్రజ రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాతాన్ని పఠిస్తారు. అదే సమయంలో తాళ్లపాక అన్నమాచార్య వంశస్థుడు ఒకరు అన్నమయ్య కీర్తనలలో కొన్నిటిని ఆలపిస్తారు. సంస్కృతంలో సుప్రభాతం అంటే శుభోదయం/గుడ్ మార్నింగ్ అని అర్థం. సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనంతో ఈ సేవ ముగుస్తుంది. సుప్రభాతంలో 29 శ్లోకాలు, స్తోత్రంలో 11 శ్లోకాలు, ప్రపత్తిలో 16 చరణాలు, మంగళా శాసనంలో 14 చరణాలు ఉంటాయి. సుప్రభాత సేవ ముగిసిన తర్వాత శయన మండపం నుంచి భోగ శ్రీనివాస మూర్తిని గర్భగుడిలోకి తీసుకెళతారు. సుప్రభాత సేవకు అరగంట సమయం తీసుకుంటుంది. సుప్రభాతం ముగిసిన వెంటనే బంగారు వాకిలిని తెరుస్తారు. సుప్రభాత సేవ టికెట్లను టీటీడీ వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ విధానంలో కొనుగోలు చేసుకోవచ్చు. ఏడాదిలో ధనుర్మాసం మినహా మిగిలిన అన్ని రోజులూ వేకువజామున తప్పనిసరిగా జరిగే సేవ ఇది. కాకపోతే ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై సేవ ఉంటుంది.

English summary

Tirumala Venkateswara Swamy sevas