తిరుమలలో శ్రీవారి తొలి దర్శనం, పూజ, నైవేద్యం ఎవరికో తెలుసా?

Tirumalalo Srivari tholi darshanam evariko telusa

05:32 PM ON 26th October, 2016 By Mirchi Vilas

Tirumalalo Srivari tholi darshanam evariko telusa

తిరుమల శ్రీవారిని ఎన్ని సార్లు దర్శించినా, అక్కడ తెలుసుకోవలసినవి చాలానే ఉంటాయి. ఇప్పటికీ చాలామందికి చాలా విషయాలు తెలియవు. ఇక తిరుమలలో ప్రధమ దర్శనం, పూజ, నైవేద్యం ఎవరికో తెలుసా? ఇది తెలుసుకోవాలంటే కొంత చరిత్రలోకి వెళ్లాల్సిందే..

నేను ఉండేందుకు 100 అడుగుల స్థలాన్ని ఇస్తే... ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం నీకే అనే ఒప్పందంతో చిత్తూరు జిల్లా తిరుమలలో వరాహ స్వామి నుంచి స్థలం దానం తీసుకుని కొండ పైన కొలువుదీరాడట వేంకటేశ్వరుడు. అదిగో ఆ ఒప్పందం మేరకు నేటికీ ఒప్పందం ప్రకారం వరాహ స్వామికే మొదట పూజా నైవేద్యాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వరాహస్వామి విగ్రహం వద్ద సుమారు ఒక అడుగు చతురస్రాకార రాగి ఫలకం ఉంది. దీనిని వేంకటేశ్వర స్వామికి వరాహస్వామి రాసిచ్చిన దానపత్ర మని చెబుతారు.

1/4 Pages

తిరుమలలో శ్రీవారి పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా వరాహస్వామి ఆలయం ఉంది. మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవత రించి భూదేవిని రక్షించి అక్కడే నిలిచాడు. ఆ తర్వాత వేంకటేశ్వరస్వామి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాడనేది స్థల పురాణం. ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకుంటేనే ఫలప్రదం అని భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా. క్రీ.శ.1800 ప్రాంతంలో వరాహస్వామి ఆలయంలో ఆదాయం తక్కువగా ఉండటంతో ఈస్టిండియా కంపెనీ దీని పర్యవేక్షణ నిరాకరించింది.

English summary

Tirumalalo Srivari tholi darshanam evariko telusa