హీరోయిన్ చాన్స్ అడిగితే 3నెలలు గడపమన్న హీరో

Tisca chopra Talks About The Problems In Film Industry

12:07 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Tisca chopra Talks About The Problems  In Film Industry

సినిమాల్లో అవకాశాలు రావాలంటే ముఖ్యంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టాలంటే, అన్నీ వదిలేసుకోవాలి. ఈ విషయం తరచూ ఆనోటా ఈనోటా వింటూంటాం. అంతెందుకు ఒక యువతి సినిమాల్లో అవకాశం పొందడానికి ఎలాంటి ‘పనులు చేయాలో దర్శకుడు కృష్ణవంశీ ‘ఖడ్గం’ మూవీలో కళ్లకు కట్టినట్లు చెప్పాడు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అందులో ఆ నటి ప్రాధేయపడినా సరే లాభం లేకపోయిన విషయం గుర్తుంది కదా. సరిగ్గా అలాంటి సంఘటనే తన జీవితంలో జరిగిందని బాలీవుడ్ తో పాటు ‘మల్లెపువ్వు’, ‘బ్రూస్లీ’ వంటి తెలుగు సినిమాల్లో నటించిన హాట్ భామ టిస్కా చోప్రా చెప్పింది. తాను కొత్తగా బాలీవుడ్ లో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు ఒక ప్రముఖ హీరో తనతో గడిపేందుకు వస్తేనే సినిమాల్లో అవకాశం ఇస్తానన్నాడని ఈ అమ్మడు తెలిపింది. అదికూడా ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా మూడు నెలలు తనతో గదిలో గడిపితేనే ఛాన్స్ ఇస్తానన్నాడని చెప్పింది. ఆ విధంగా అన్నది హీరోనే కాదని, ఒక ప్రముఖ దర్శకుడు కూడా తనను ఈ విధంగా అడిగాడని టిస్కా అంటోంది. అయితే తన గురించి ఇలా వివరాలు చెప్పిన ఈ భామ ఆ హీరో, దర్శకుడు ఎవరో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. అయితే, తాను వాళ్లకు లొంగకుండానే అవకాశాలు అందుకున్నానని, కానీ, చాలామంది బీ గ్రేడ్ హీరోయిన్లు ఇలాంటి ఆఫర్లతో మోసం చేసేవాళ్లకు బుద్ధి చెప్పాలని అంటోంది. సినిమా రంగంలో స్థిరపడాలంటే ఇలాంటివి తప్పవని, పడక సుఖం కోసం ఆత్రంగా చూసే చూసేవాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారని ఈమె చెప్పే మాట.

ఇది కూడా చూడండి: మగవారు మొలతాడు ధరించడం వెనుక అసలు కారణం!

ఇది కూడా చూడండి: కలాం హెయిర్ స్టైల్ తో పాటు మీకు తెలియని నిజాలు!

ఇది కూడా చూడండి: ఈ లక్షణాలు కనిపిస్తే మరణానికి దగ్గర్లో ఉన్నట్టేనా?

English summary

Tisca Chopra opens up about director and hero ugly behavior but she did not tell those names.