నిజమైన 'టైటానిక్' మునిగిపోయిన వీడియో

Titanic ship sinking video

05:42 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Titanic ship sinking video

టైటానిక్ షిప్ ఓ అద్భుత నిర్మాణం. దాదాపు 104 సంవత్సరాల క్రితం ప్యాసింజర్లతో ప్రయాణిస్తూ నీట మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ షిప్ మునిగిపోయిన సంఘటన ని ఒక కధగా తెరకెక్కించాలనుకున్నాడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. అయితే ఆ ఒక్క ఓడ విషాద గాధ గురించే చూపిస్తే జనం చూడరని దానికి ఒక ప్రేమ కధని కలిపి అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ ఓడ ఎలా మునిగిపోయిందో సినిమా రూపంలో కరెక్ట్ గా చూపించడానికి, నిజంగా టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశానికి వెళ్లి(సముద్రం లోపలకి) దాని గురించి ఎంతో తెలుసుకుని చిత్రంగా మలిచాడు.

1997లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచ సినీ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. ఆస్కార్ తో సహా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, జేమ్స్ కామెరాన్ ఈ చిత్రాన్ని 3 గంటల 15 నిమిషాలు పాటు చూపిస్తే, తాజాగా 'టైటానిక్ సింకింగ్ ఆల్ ఇన్ రియల్ టైం' పేరిట 2గంటల 40 నిమిషాలు ఉన్న వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ వీడియోని నెటిజన్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. యూట్యూబ్ లో ఈ వీడియో అప్ లోడ్ చేసిన నాలుగు రోజులకే 16 లక్షల వ్యూలు వచ్చి రికార్డు సృష్టిస్తుంది.

English summary

Titanic ship sinking video. Original Titanic Ship sinking video were released in Youtube. In realtime Titanic ship sinked time is 2 hours 40 minutes.