ఆ 450 సంచుల్లో ఏముంది ?

title: A passenger arriving at Los Angels international airport from mexico

01:21 PM ON 20th November, 2015 By Mirchi Vilas

title: A passenger arriving at Los Angels international airport from mexico

అక్రమ పంది మాంసం కేసులో నిందితుడైన మెక్సికోకి చెందిన వ్యక్తి లాస్ ఏంజిల్స్లో అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాడు. దాంతో అక్కడి కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు తనికీలు నిర్వహించడంతో అతని ట్రావెలర్ సామాన్లలో 450 సంచుల అక్రమ పందిమాంసం లభించింది. దాంతో $1000 జరిమానా విధించారు. ఈ సంఘటన నవంబర్ 2 న చోటుచేసుకుంది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఈ విషయాన్ని బుధవారం నాడు తెలిపారు.

అధికారులు నిందితుడిని ప్రశ్నించగా నిందితుడు ఉడకబెట్టిన మాంసాన్ని తీసుకువెళ్ళుతున్నాడని తెలిపాడు, దానికి ఆ అధికారులు అందులో పందిమాంసం ఉందా అని అడుగగా లేదు అని ఆ ప్రయాణికుడు అబద్ధం చెప్పాడని వారు పేర్కొన్నారు. తర్వాత అధికారులు తనికీలు నిర్వహించడంలో 450 చట్టవిరుద్ధమైన పందిమాంసం ప్లాస్టిక్ సంచులో కట్టి ఉన్నాయని వారు తనికీల అనంతరం తెలుసుకున్నామని తెలియజేసారు. ఇలాంటివి తమదేశంలో చొరబడడం వలన తమకు ప్రాణాంతకమైన వ్యాదులు వ్యాపిస్తాయని తెలియజేస్తూ ఆ 450 సంచులను నాశనం చేసేశామని తెలిపారు.

English summary

Illegal pork tamales seized in Los Angels