మెగా మూవీకి టైటిల్ ఖరారు!

Title confirmed for Chiranjeevi 150th movie

10:25 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Title confirmed for Chiranjeevi 150th movie

సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ, ప్రతిష్ఠాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150 మూవీకి టైటిల్ ఖరారైంది. ఎట్టకేలకు చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీకి చిరు బర్త్ డేకి రెండురోజుల ముందుగా దీన్ని ఓకే చేశారు. ఖైదీ నెం.150 అని ఖరారు చేయడం, అఫీషియల్ గా ప్రకటించడం జరిగిపోయింది. తొలుత కత్తిలాంటోడు, ఆ తర్వాత నెపోలియన్ వంటి పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ అవేమీ ఫైనల్ కాలేదు.. చివరకు ఖైదీ నెంబర్ 150కి మెగా క్యాంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చిరు 150వ మూవీకి ఈ పేరు పెట్టడానికి కారణాలు చాలానే వున్నాయి. ఖైదీ, ఖైదీ నెంబర్ 786 వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడం ఒకటైతే, ఇదే సెంటిమెంట్ మెగాక్యాంప్ ని వెంటాడింది.

అందులోనూ ల్యాండ్ మార్క్ మూవీ కావడం ఒకటైతే, జైలు తరహా సీన్స్ వుండడంతో ఖైదీ నెంబర్ 150గా ఫైనల్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. చాలామంది మాత్రం ఖైదీ 3 గా వర్ణించుకుంటున్నారు. ఈ టైటిల్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ కు కొదవలేదు. మొత్తానికి ఖైదీ, ఖైదీ నెంబర్ 786 మూవీలు ఘనవిజయం సాధించడంతో అదే తరహా టైటిల్ ఫిక్స్ చేశారన్నమాట.

English summary

Title confirmed for Chiranjeevi 150th movie