ఎన్టిఆర్ ట్రస్ట్ ఎదుట తెలుగు విద్యార్ధుల లొల్లి 

TNSF Concern At NTR Trust

10:21 AM ON 21st January, 2016 By Mirchi Vilas

TNSF Concern At NTR Trust

గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపులో టిడిపిలో లొల్లి రాజుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌లు కుమ్మక్కై గ్రేటర్ టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యేల వ్యవహారంపై టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తూ, పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేశారు. తమకు అయిదు స్థానాలు ఇస్తామని చెప్పి ఒక్క స్థానం ఇవ్వలేదని టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తెలంగాణ టీడీపీ బాధ్యతలను వేరేవారికి అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇక ఈ లొల్లి వెనుకు ఎవరైనా వున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధినేత విదేశంలో వున్న నేపధ్యంలో వచ్చాక ఈ వ్యవహారంపై బాబు గారు సీరియస్ గా స్పందించడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary

Telugu Desam Party TNSF Students concern at NTR trust in Hyderabad. They have been tared the flexies and posters of Telugu Desam party.They have demanded to change the TDP leader in Telangana