బ్యాంకుల్లో కొత్త నోట్లు పొందడానికి ఫారం ఇదా?

To change the 500 and 1000 rupees notes we have to fill the form

06:12 PM ON 9th November, 2016 By Mirchi Vilas

To change the 500 and 1000 rupees notes we have to fill the form

రూ. 500, రూ. 1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఈ నిర్ణయంతో నల్ల దొంగలకు ముచ్చెమటలు పడుతుంటే, ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు నానా పాట్లు పడుతున్నారు. అర్థరాత్రి నుంచి జనం ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరారు. ఇదిలా ఉంటే, పాత నోట్లు మార్చుకునేందుకు డిసెంబర్ 30 వరకూ గడువిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకునే ప్రక్రియకు సంబంధించిన డిమానిస్ట్రేషన్ ఫామ్ ఇదేనంటూ నెట్ లో ఓ ఫోటో వైరల్ అవుతోంది.

అందులో ఉన్న వివరాల ప్రకారం, పాతవి 500, 1000 నోట్లు ఎన్ని ఉన్నాయని డినామినేషన్, బ్యాంకు పేరు, బ్రాంచ్ తదితర ఖాళీలను నింపాల్సి ఉంటుంది. కొత్త నోట్లను పొందాలంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్, పాన్ కార్డ్... వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేసారు. ఈ వివరాలన్నీ నింపిన ఫామ్ తో పాటు పాత నోట్లను బ్యాంకులో అధికారులకు ఇస్తే తిరిగి కొత్త నోట్లను ఇస్తారని టాక్. మొత్తానికి నెట్ లో హల్ చల్ చేస్తున్న ఫార్మ్ ఓ సారి చూడండి.

English summary

To change the 500 and 1000 rupees notes we have to fill the form