డాన్సర్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఒళ్ళు అప్పగించాల్సిందే!

To get chance for dancer they have to do romance with them

11:45 AM ON 19th September, 2016 By Mirchi Vilas

To get chance for dancer they have to do romance with them

అభం శుభం తెలీని బాలికలకు మాయమాటలు చెప్పి, ఆపై అత్యాచారాలకు, హత్యలకు ఒడిగడుతున్నారు. అయితే ఇందులో మగాళ్లకు మహిళలు సహకరించడం ఇంకా దారుణం. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే, నృత్య కళాకారిణిగా గుర్తింపుపొందాలన్న ఆ బాలిక ఇష్టాన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు మహిళలు ఆమెను అపహరించి, ఆపై అత్యాచారం చేయించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరం పాయకాపురం రాధానగర్ కు చెందిన బాలిక(16)కు చిన్ననాటి నుంచి నృత్యంపై మక్కువ ఎక్కువ. వేదికపై నృత్యాలు చేయడమంటే ఎంతో ఇష్టం.

ఈ విషయాన్ని తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన మహిళలు లక్ష్మి, కనకాలు బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం, నర్సీపట్నం తీసుకెళ్లి అక్కడ వేదికలపై నృత్యాలు చేయించారు. అనంతరం బాలికపై ఓ వ్యక్తి రేప్ చేశాడు. ఇదేమి దారుణమని ఆ బాలిక ప్రశ్నిస్తే, నృత్య కళాకారిణి కావాలంటే ఇలాంటివి తప్పవని ఆ ఇద్దరు మహిళలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ కుమార్తె అదృశ్యమైందని, ఇద్దరి మహిళలపై అనుమానం ఉందని బాలిక తల్లి విజయవాడనున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన సీఐ సాహెరాబేగం విచారణ ప్రారంభించారు. బాలిక ఆచూకి తెలుసుకుని, నింధితులైన ఇద్దరి మహిళలను అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

English summary

To get chance for dancer they have to do romance with them. In Vijayawada surrounding Payakapuram village people giving chance to lady dancers by having sex with them.