వత్తైన కనుబొమ్మల కోసం..

To get thick eyebrows

12:51 PM ON 19th December, 2015 By Mirchi Vilas

To get thick eyebrows

చాలామందికి వత్తైన కనుబొమ్మలు ఉంటాయి. వాటిని చాలా అందంగా షేప్‌ చేసుకుని చూడడానికి చక్కగా కనబడతారు. ఒకొక్కరివి ఒక్కో ఆకారంలో ఉంటాయి. కొంతమందివి విల్లులా బలే అందంగా ఉంటాయి, మరికొందరికి గీత గీసినట్లు ఇలా ఎన్నో ఆకారాలలో ఉంటాయి. వత్తుగా ఉంటే సరే కాని కొంతమందికి పాపం అసలు ఉండవు చాలా పలుచగా కనిపించి కనిపించకుండా ఉంటాయి. అలాంటి వారు కొన్ని చిట్కాలను వాడడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో వాడే వాటితోనే అద్బుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. సహజసిద్దమైన పద్దతులని వాడడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు సంభవించవు. సహజంగా మీ కనుబొమ్మల ఎదుగుదలకు సహాయపడతాయి. ఇప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. ఆముదము

ఆముదము కనుబొమ్మలను పెంచడంలో మంచి ఔషదముగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్స్‌, ప్రొటీన్స్‌, ప్యాటీ ఆసిడ్స్‌ మరియు యాంటీ ఆక్సిడెండ్స్‌ తో పాటు పోషక విలువలు కలిగి కనుబొమ్మను వత్తుగా పెంచడంలో సహాయపడుతుంది.

  • సహజమైన ఆముదాన్ని తీసుకుని అందులో దూదిని ముంచి మీ కనుబొమ్మలకు రాసుకోవాలి.
  • తరువాత మీ చేతి వేళ్ళతో 2 నుండి 3 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి.
  • పడుకునే ముందు రాసుకొని మరుసటి రోజు గోరువెచ్చని నీటితో కడగాలి.
  • ఈ విధంగా రోజూ చేయడం వలన వత్తైన కనుబొమ్మలను మీ సొంతం చేసుకోవచ్చు.

గమనిక :

  • ఆముదం వాడేటప్పుడు ఏ విధమైన ఇరిటేషన్‌ కలిగినా ఆముదము రాసుకోవడం మానేయడం మంచిది.

English summary

Many people end up with eyebrows that are too thin because of over plucking, threading or waxing. Thick eyebrows have always been in demand.