ఊపిరితిత్తులను 4 విధాలుగా శుభ్రపరుచుకోవచ్చు

To purifies your lungs in four ways

03:30 PM ON 16th November, 2015 By Mirchi Vilas

To purifies your lungs in four ways

మీకు సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే మీరు ఆపదలో ఉన్నట్లే లెక్క . ప్రస్తుత సమాజంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా సిగరెట్‌ ని తాగుతున్నారు.ఈ కాలంలో అదో పెద్ధ ప్యాషన్‌ అయిపోయింది. ఇవి తాగే వారికి ఊపిరితిత్తులు పాడైపోతాయి. అని తెలిసి కూడా చాలామంది దానిని వదులుకోరు. కొంత మంది పరిశోదకులు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు. ఎలా ఊపిరితిత్తులను శుభ్రపరచుకోవాలనే విషయంపై మనకు కొన్ని చిట్కాలను అందించారు. మన ఇంట్లో వాడే కొన్ని పదార్ధాల ద్వారా ఊపిరితిత్తులను శుభ్రపరచుకోవచ్చు.

అల్లం: ఇందులో యాంటిబ్యాక్టీరియ , యాంటిసెప్టిక్ లక్షణాలు దీనికి ఉన్నాయి. శరీరాన్ని ఏ రకమైన ఇన్‌ఫేక్షన్‌కు గురి కాకుండా చూస్తుంది. ఇది ఊపిరితిత్తులో శ్వాస బాగా ఆడేలాగా చేస్తుంది.

వెల్లుల్లి: ఇది ఊపిరితిత్తులకు నిజమైన తాజదనాన్ని అందిస్తుంది. ఇంకా శరీరానికి కావాలసిన పోషకవిలువలు అందజేస్తుంది. అలాగే ఊపిరితిత్తులను పరిశుభ్రముగా ఉంచుతుంది.

దాక్షపండు: ఇది కాన్సర్‌ ని దరిచేరకుండా చూసుకుంటుంది. దీనిని వాడడం వలన కాన్సర్‌ కలిగించే కారకాలను తగ్గించవచ్చు. గ్రేప్‌ ప్రూట్‌ ఫ్రీ రాడికల్స్‌ తో పోరాటం చేస్తుంది.

సెలీనీయమ్ ద్వారా రోజు వారీ సెలినియమ్‌ శరీరానికి కావలసిన మినరల్స్‌ అందిస్తాయి. పుట్టగొడుగులు, గుడ్లు, వెల్లుల్లి, బ్రోకోలి, పాలకూర, ఇంకా మొదలైనవి సెలీనీయమ్ జాబితా లోనివే. ఇవి తినడంవలన శరీరానికి కావాలసిన ప్రోటీన్స్‌ మినరల్స్‌ ఇంకా విటమిన్‌ లను అందిస్తాయి. వీటితో పాటు శరీరానికి కావలసినన్ని మంచి నీళ్ళు తాగడం మంచిది.

సిగేరెట్ ఇంకా టొబాకొ అలవాట్లను మానుకోవడం మంచిది లేకపోతే కాన్సర్‌ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానిని మానుకోవడం వలన మీరు, మీ సన్నిహితులు ఎంతో సంతోషిస్తారు. సంతోషంగా జీవిస్తారు. కాన్సర్‌ బారినుండి రక్షించబడతారు.

English summary

To purifies your lungs in four ways. purify your lungs in home based treatment in 4 ways,then your lungs are healthy.