యూట్యూబ్‌లో బాహుబలి కోసం @150

To watch Bahubali in youtube you have to pay 150 rupees

01:48 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

To watch Bahubali in youtube you have to pay 150 rupees

ఎస్‌.ఎస్‌. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం 'బాహుబలి' ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చేసింది. హై రిజాల్యూషన్‌ 4కే వెర్షన్‌ తో యూట్యూబ్‌లో బాహుబలిని అప్‌లోడ్‌ చేశారు. ఆగండి ఆగండి ఏంటి ఇలా చెప్పిన వెంటనే అలా వెళ్లి చూసేద్దాం అనుకుంటున్నారా? ఆ పప్పులేమీ ఉడకవ్, కంగారుపడకండి బాహుబలిని చూడాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి. బాహుబలిని చూడాలంటే 150 రూపాయలు ఖర్చు పెట్టాలి అంతే కాదు పైరసీని అడ్డుకునేందుకు చాలా నిబంధనలనే పెట్టారు. బాహుబలి చిత్రం కోసం 150 రూపాయలు ఆన్‌లైన్‌లో పే చెయ్యాల్సి ఉంటుంది.

పే చేశాక ఆ సినిమాని నెల రోజుల్లో చూసేయాలి. ఒకవేళ నెల రోజుల్లో ఎప్పుడైనా సినిమాని చూడడం మొదలు పెడితే 48 గంటల్లోనే సినిమాని చూసేయాలి. లేదంటే మీకు ఇచ్చిన కోడ్‌ 48 గంటల తరువాత ఎక్స్‌పైర్‌ అయిపోతుంది. అయితే ఇంకోటి యూట్యూబ్‌లో ఉందికదా డౌన్‌లోడ్‌ చేసేసి చూసేయచ్చు అనుకుంటే పొరపాటే. బాహుబలి చిత్రాన్ని కాపీ చేసేందుకు, డౌన్‌లోడ్‌ చేసేందుకు, అప్‌లోడ్‌ చేసేందుకు ఆస్కారం లేదు. అంతేకాదు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో మాత్రమే చూడాలి వేరే చోట షేర్‌ చేసి చూసే అవకాశం లేదు. మొత్తానికి బాహుబలి కోసం రాజమౌళి ఓ వ్యూహాన్నే రచించాడు.

English summary

To watch Bahubali in youtube you have to pay 150 rupees and also some terms terms and conditions.