పితృ తర్పాణాలతో ఋణం తీర్చే... మహాలయ అమావాస్య నేడే

Today is Amavasya

02:53 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Today is Amavasya

మిగిలిన అమావాస్యలకు మహాలయ అమావాస్యకు తేడా వుంది. శ్రావణ మాసంలో వచ్చే పోలాల అమావాస్య, సంక్రాంతి వెళ్ళాక వచ్చే చొల్లంగి అమావాస్యకు కూడా ప్రాధ్యాన్యత వుంది. అయితే ప్రతి అమావాస్య కూడా పితృ దేవతలకు తర్పణాదులు వదలవచ్చు. కానీ మహాలయ అమావాస్య చాలా శ్రేష్టం. ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్ ఆషాఢ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు(పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది, అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షములంటారు.

చివరగా వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ పక్షములో పితృ దేవతలు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయని పెద్దలు చెబుతారు.

1/5 Pages

భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము. మహాలయమంటే- మహాన్ అలయః, మహాన్ లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు. అమావాస్య అంతరార్థం: అమా అంటే దానితోపాటు, వాస్య అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు.

English summary

Today is Amavasya