టోల్ టాక్స్ రద్దు(వీడియో)

Toll gate tax was cancelled

10:28 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Toll gate tax was cancelled

500/- 1000/- నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో. కేంద్ర రవాణాశాఖ మంత్రి టోల్ టాక్స్ లను శుక్రవారం అర్థరాత్రి వరకు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాత 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు అని నిన్న రాత్రి ప్రధాని చెప్పినప్పటి నుండి టోల్ గేట్స్ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. టోల్ నిర్వాహకులు 500/- 1000/- రూపాయలను తీసుకోకపోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని టోల్ గేట్స్ వద్ద సిబ్బందికి, వాహనదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. పాత నోట్ల రద్దు, ఇంకా అందుబాటులోకి రాని కొత్త నోట్ల కారణంగా డబ్బుల షాటేజ్ ఉన్న నేపథ్యంలో. కేంద్ర మంత్రి ఈ నెల 11వ తేదీ వరకు అంటే శుక్రవారం అర్థరాత్రి వరకు టోల్ టాక్స్ ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేసారు.

English summary

Toll gate tax was cancelled