'గ్యారేజ్' లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ అదుర్స్.. ఇలాగే దూసుకుపోవాలట!

Tollywood celebrities praises Ntr performance in Janatha Garage movie

03:27 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Tollywood celebrities praises Ntr performance in Janatha Garage movie

అబ్బో, జనతా గ్యారేజ్ కి డివైడ్ టాక్ వచ్చినా తారక్ కి మాత్రం వీరలెవెల్లో అభినందనలు వచ్చిపడుతున్నాయట. నిన్ను చూడాలనితో తెరకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ నాటి నుంచి సినిమాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్లో ముందుకెళుతున్నాడు. ఇప్పటి దాకా ఎన్ని హిట్లు కొట్టాడు? నెం.1 హీరోనేనా? వంటి విషయాలను పట్టించుకోకుండా ఆలోచిస్తే, ఓ నటుడిగా తారక్ మంచి మార్కులే సాధించాడని సినీ విశ్లేషకులు చెప్పేమాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒకెత్తైతే, ప్రస్తుత జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ ఒకెత్తు అని ప్రశంసిస్తున్నారు.

1/3 Pages

అటు రొటీన్ ఊర మాస్ కేరెక్టర్ గానీ, ఇటు గత సినిమాలాగా క్లాస్ కేరెక్టరూ కాకుండా, మరీ ముఖ్యంగా తొడగొట్టడాలు, భారీ భారీ డైలాగులు లేకుండా నటనలో మరింత పరిణితి సాధించాడని సినీవర్గాలు చెప్పుకుంటున్నారు. జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ పలికే చిన్నచిన్న సంభాషణలు, వాటి ప్రెజెంటేషన్ చాలా బాగుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోహన్ లాల్ లాంటి లెజెండ్ ఎదురుగా ఉన్నా.. ఆనంద్ పాత్రలో నటన పరంగా మరో మెట్టు పైకెక్కాడని అంటున్నారు. ఇక, ఇంటర్వల్ కు ముందు తొలిసారి సినిమాలో మోహన్ లాల్ ను కలిసే సన్నివేశంలో చాలా బాగా నటించాడని, అందరి దృష్టి ఎన్టీఆర్ డిక్షన్ పైనే ఉందని అంటున్నారట.

English summary

Tollywood celebrities praises Ntr performance in Janatha Garage movie