హీరోని చేస్తానని యువకుడు దగ్గర 6 లక్షలు నొక్కేసిన టాలీవుడ్ డైరెక్టర్!

Tollywood director Vasudeva Naidu cheats 6 lakhs

05:09 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Tollywood director Vasudeva Naidu cheats 6 lakhs

ప్రతీ ఒక్కరికి తాను హీరో అవ్వాలని మనసులో ఉంటుంది. అయితే పరిస్థుతల ప్రభావం వల్లో, లేక పోటీ వల్లో అది ప్రతీ ఒక్కరికి సాధ్యం కాదు.అయితే సినిమా పిచ్చితో జీవితాలను పాడుచేసుకున్న యువకులు ఎందరో ఉన్నారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి విలువైన యవ్వనాన్ని కరగబెట్టుకున్నవారి గురించి మనం విన్నాం. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ కధలో ఓ యువకుడు హీరో అయిపోదామని డబ్బులు కూడా పో గొట్టుకున్నాడు. ఈ కధ వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన మురళీధర్ రెడ్డి అనే యువకుడికి వాసుదేవనాయుడు అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

తను సినీ దర్శకుడినని షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వచ్చానని చెప్పాడు. ఇద్దరికీ కొంత పరిచయం పెరిగాక నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నువ్వే హీరోవి అంటూ మురళీధర్ రెడ్డికి వాసుదేవనాయుడు నమ్మబలికాడు. సినిమాకు కొంచెం డబ్బు సర్దుబాటు చేయాలంటే మురళీధర్ రెడ్డి ఆ దర్శకుడికి రూ. 6 లక్షలు సమర్పించుకున్నాడు. కట్ చేస్తే హైదరాబాద్ కు వచ్చిన వాసుదేవనాయుడు 'బిట్రగుంట' అనే సినిమాను తీస్తున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు. ఆ సినిమాలో హీరోగా వేరే యువకుడ్ని ప్రకటించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మురళీధర్ రెడ్డి తన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వాసుదేవనాయుడిపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాడు.

English summary

Tollywood director Vasudeva Naidu cheats 6 lakhs