ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

Tollywood hero Uday Kiran in erragadda mental hospital

09:39 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Tollywood hero Uday Kiran in erragadda mental hospital

జైలులో ఉన్న ఫేస్‌బుక్‌ సినిమా హీరో ఉదయ్‌కిరణ్‌ మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు పిచ్చాస్పత్రికి తరలించారు. అతనిని ముషీరాబాద్‌ జైలు నుంచి ఎర్రగడ్డ పిచ్చాస్పత్రికి జైలు సిబ్బంది తీసుకెళ్ళారు. జైల్లో తోటి ఖైదీల పై ఉదయ్‌ కిరణ్‌ దాడి చేశాడని అధికారులు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ హోటల్ సిబ్బంది పై దాడికి పాల్పడిన కేసులో ఉదయ్‌కిరణ్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఉన్న ఉదయ్‌కిరణ్‌ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. కోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా జ‌డ్జి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఉద‌య్‌కిర‌ణ్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు తెలిపారు. దాంతో వెంటనే అతడిని మానసిక వైధ్యులకు చూపించి.. వారి నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. దీంతో పోలీసులు అత‌డిని ఎర్ర‌గ‌డ్డ పిచ్చాసుప‌త్రికి తరలించారు. ఫేస్‌బుక్ సినిమాలో న‌టించిన ఉద‌య్‌కిర‌ణ్‌ పై తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌, రాజ‌మండ్రితో పాటు హైద‌రాబాద్‌లో కూడా వివిధ పోలీస్‌స్టేష‌న్ల‌లో కేసులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం అతడు ఓవర్ ద మూన్ పబ్‌కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు.

దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు అత‌డి పై పీడీ చ‌ట్టం కింద కేసులు కూడా పెట్టారు.

English summary

Tollywood hero Uday Kiran in erragadda mental hospital. Facebook movie hero Uday Kiran in erragadda mental hospital.