మలుపు తిరిగింది

Tollywood Movie Offers To Nikki Galrani

11:07 AM ON 24th February, 2016 By Mirchi Vilas

Tollywood Movie Offers To Nikki Galrani

ఇటీవల విడుదలైన కృష్ణాష్టమి, మలుపు చిత్రాలలో నటించి ఎనర్జీటిక్‌గా హీరోయిన్‌గా పేరు సంపాదించింది బెంగుళూరు బ్యూటీ నిక్కీగల్రాని. నిక్కి నటించిన చిత్రాలు రెండు ఒకేరోజు విడుదలై మంచి టాక్‌ సంపాదించుకున్నాయి. దీంతో నిక్కీగల్రాని సినీ కెరీర్‌ మంచి మలుపు తీసుకుంది.

ఇక్కడ కృష్ణాష్టమి, మలుపు రెండు చిత్రాలతో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన నిక్కికు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. అనేకమంది దర్శకులు ఇప్పటికే ఈ అమ్మడిని సంప్రదించారని సమాచారం. కృష్ణాష్టమి సినిమాను నిర్మించిన దిల్‌రాజు బ్యానర్‌ లోనే మరో రెండు సినిమాలు చేయనుందట. ఇలా వరుస ఆఫర్లతో నిక్కి ఆనందంలో మునిగితేలుతోంది.

English summary

Nikki Galrani was became popular in Tollywood with her movies like Krishnastami and Malupu.She attracted Telugu audience with her energetic acting .At present she was getting offers from various directors.