టాలీవుడ్ ప్రొడ్యూసర్ అరెస్ట్!

Tollywood producer arrested in Vizag

04:37 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Tollywood producer arrested in Vizag

గతంలో అయితే సినీ నిర్మాతలు హుందాగా ఉండేవారు. వాళ్ళపని తప్ప మరొకటి పట్టేది కాదు. ఇప్పుడు అన్ని రంగాల్లానే సినీ రంగంలో కూడా రకరకాల మార్పులు వచ్చేసాయి. అందరూ ఇందులోకి రావడం వలన కూడా కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎంవీవీ సత్యనారాయణని విశాఖలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎంవీవీ నిర్మాతగా 'లక్కున్నోడు' మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సినిమా పరంగా కాకుండా, భూ ఆక్రమణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియం ఎదురుగావున్న ల్యాండ్ కు సంబంధించి కొంతమంది నుంచి స్థలాలు సేకరించిన ఆయన, విశాఖపట్నం సిటీ పేరిట గృహనిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు.

ఈ క్రమంలో లే అవుట్ లో వున్న ఇతరుల భూముల్ని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మించారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. అయితే, తమ స్థలాన్ని ఎంవీవీ ఆక్రమించారని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లాకి ఓ వ్యక్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరోపణ రుజువు కావడంతో ఎంవీపీ కాలనీలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే తనకు గుండెలో నొప్పి వస్తుందని చెప్పడంతో ట్రీట్మెంట్ కోసం ఆయన్ని కేజీహెచ్ కు తరలించారు. గతంలో కూడా ఆక్రమణలకు సంబంధించి ఈ ప్రొడ్యూసర్ పై కేసులు నమోదైందని పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

ఇది కూడా చదవండి: గర్భిణి భార్యను ఫ్రెండ్ తో కల్సి హత్యచేసిన తాగుబోతు భర్త

ఇది కూడా చదవండి: పని ఉందంటూ స్టూడెంట్ ని ఇంటికి తీసుకెళ్లి కోరిక తీర్చుకున్న టీచర్.. ఆపై..

English summary

Tollywood producer arrested in Vizag. Tollywood producer MVV Satyanarayana arrested in Vishakhapatnam.