సొంత ఇంటిని అమ్మకానికి పెట్టిన టాప్ డైరెక్టర్!

Tollywood Top Director House for Sale

11:40 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Tollywood Top Director House for Sale

సగటు ప్రేక్షకుడి మొఖంలో నవ్వులు విరగబూసాయంటే, అది ఖచ్చితంగా శ్రీను వైట్ల మూవీ అని చెప్పాల్సిందే. 'నీకోసం'తో మొదలైన ఈ డైరెక్టర్ ప్రస్థానం.. బ్రూస్ లీ వరకు సాగింది. తాజాగా ఈ టాప్ డైరెక్టర్ తీస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ నటించే, ‘మిస్టర్’ పట్టాలపై ఉంది. అయితే.. విజయాలతో పాటు శ్రీను వైట్ల ఇటీవల వరుస వైఫల్యాలను మూటగట్టుకున్నాడు దూకుడు, బాద్ షా వంటి హిట్ల తర్వాత ఆగడు, బ్రూస్ లీ వంటి ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో అవకాశాలు కొంత మేర తగ్గాయి. ఇక, ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన రచయిత కోన వెంకట్ తో విభేదాలు పొడసూపడంతో ఆ రిలేషన్ కూడా దెబ్బకొట్టింది. దాంతో పాటు కుటుంబ సమస్యలూ అతడికి తోడయ్యాయి. అతడి భార్య రూపా వైట్ల అతడిపై కేసు పెట్టింది. పెద్దల రాజీతో అది సద్దుమణిగిందనుకోండి. ఇప్పుడు శ్రీను వైట్ల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడట.

ఫ్లాపులు తెచ్చిన అప్పులో మరి ఏ ఇతర కారణమో తెలియదు కానీ, ఇంటిని అమ్మాలని డిసైడ్ అయ్యాడట శ్రీను వైట్ల. అప్పుల వల్లే అని కొందరు అంటున్నా, వాస్తు రీత్యా అమ్ముతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటి వాస్తు బాగాలేదని, మళ్లీ మెరుగైన అవకాశాలు, విజయాలు రావాలంటే ఇంటిని అమ్మేయాలని తమ ఇంటి పండితుడు చెప్పాడట. అందుకే ఇంటిని రూ.15 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడట. అయితే.. ఇంటిని కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదట. దీంతో సినీ వర్గాల్లో చాలా మంది అయ్యో పాపం అంటున్నారని టాక్. మరి ఇల్లు అమ్మేశాక అయినా ఈ డైరెక్టర్ సుడి తిరుగుతుందా లేదా అన్నది చూడాలని సినీ జనాలు అంటున్నారు.

ఇది కూడా చూడండి: వశిష్టి దేవిగా శ్రేయ అదిరింది

ఇది కూడా చూడండి: మాలో బెస్ట్ సింగరెవరంటున్న వర్మ (వీడియో)

English summary

Srinu Vaitla Top telugu film director. His first movie as a director was Nee Kosam. Now Director Srinu Vaitla House for Sale.