మాయాబజార్ ని అందించిన మేటి దర్శకుడు కెవి రెడ్డి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

Tollywood top director KV Reddy movies and life history

03:37 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Tollywood top director KV Reddy movies and life history

వందేళ్ల భారతీయ సినిమాకు ఆణిముత్యంగా నిలిచిన మాయాబజార్ సినిమా సృష్టికర్త కదిరి వెంకట రెడ్డి. తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత అయిన ఈయన కెవి రెడ్డిగా సుప్రసిద్ధమయ్యారు. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటిలేని మేటి అనిపించుకొన్న దర్శకుడు కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912వ సంవత్సరం జూలై 1న జన్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

ఉదాహరణకు సత్యహరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభక లాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుందని ఆ చిత్రాల్లోనే ఆణిముత్యాల్లాంటి పాటలే చెబుతాయి. నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఏ చిత్రం తాను నిర్ధేశకత్వం చేసినా, పథకం అంతా తనే సిద్ధం చేసేవాడు.

వేసుకున్న బడ్జెట్ లోనే సినిమా తియ్యడం సాధ్యంచేసుకున్నట్టుగానే రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు కె.వి.రెడ్డి. నిడివి విషయంలో ఎంతో దూరాలోచన ఉండేది కె.వి.రెడ్డికి. అలాగే కె.వి.కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ. ఏది తీసినా, ఏది తలపెట్టినా కథాగమనానికీ, దృశ్యనిర్మాణానికీ అతను వెచ్చించవలసిన కాలం వెచ్చించవలసిందే. అందులో రాజీ పడేవాడు కాదు. 1971 సెప్టెంబర్ 15న కన్నుమూసిన కె.వి. రెడ్డి అందించిన అపురూప చిత్రాల గురించి తెలుసుకుందాం.

1/13 Pages

1. భక్త పోతన(1942)...


కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన. ఈ సినిమాలో చిత్తూరు నాగయ్య కథానాయకుడు. 1942లో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది.

English summary

Tollywood top director KV Reddy movies and life history. Indian best movie Mayabazar movie director KV Reddy born on July 1st 1912.