నాలుక తెలిపే 10 ఆరోగ్య రహస్యాలు

Tongue reveals 10 Secrets about your health

11:52 AM ON 2nd January, 2016 By Mirchi Vilas

Tongue reveals 10 Secrets about your health

మనం సాదారణంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు  రొటీన్ చెకప్ లో బాగంగా నాలుకను చూస్తారు. మన నాలుక మొత్తం మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది. నాలుకను చూసి అనేక రకాల వ్యాధులను ప్రాధమికంగా గుర్తించవచ్చు. నోటిలో చిగుళ్ళ తరువాత నాలుక మీదే ఎక్కువగా వ్యాధి కారకాలు నివసిస్తాయి. అయినప్పటికీ నాలుక అనేది మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే అవయవాలలో ఒకటిగా ఉంది. నాలుక ఒక  అంతర్గత అవయవం అయిన సరే, బాహ్య అవయవాలను ఏ విధంగా అద్దంలో చూసుకుంటామో అలాగే నాలుకను కూడా చూస్తూనే ఉంటాం. నాలుక బహిర్గతం చేసే విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అనేక వ్యాధులను గుర్తించటంలో నాలుక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మనం నాలుకను ఆరోగ్యకరముగా నిర్వహించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ నాలుక మీద లక్షణాల బట్టి వివిధ ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించవచ్చో చూద్దాం.

1/11 Pages

1. ముదురు ఎరుపు రంగు

  • సాదారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక గులాబి రంగులో ఉంటుంది. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే, అది రక్తహీనత, కవాసాకి వ్యాధి మరియు స్కార్లెట్ జ్వరం వంటి వాటికి సంకేతంగా భావించాలి. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే విటమిన్ బి 12 లోపం ఉందని గుర్తించాలి. శరీరంలో ఎర్ర రక్తకణాలను తయారుచేయటానికి విటమిన్ B12 అవసరం. ఇది లోపిస్తే అలసట మరియు రక్తహీనత కలుగుతాయి.
  • కెనడియన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన  2009 అధ్యయనంలో ముదురు ఎరుపు రంగు నాలుక ఆరంభంలో ఎరుపు మచ్చలు లేదా పాచెస్ రూపంలో కనపడుతుంది. ఒక వ్యక్తికి రక్తహీనత ఉందని చెప్పటానికి ఇది ఒక భౌతిక లక్షణంగా చెప్పవచ్చని తెలిపింది.
  • ఇండియన్ నేషనల్ మెడికల్ జర్నల్ 2005 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో స్ట్రాబెర్రీ ఎరుపు నాలుక కవాసాకి వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటిగా తెలిపింది. రక్త నాళాలు వాచే ఈ వ్యాధి ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కనపడుతుంది.
  • స్కార్లెట్ ఫీవర్ కి కూడా స్ట్రాబెర్రీ ఎరుపు నాలుక ఒక సాధారణ లక్షణంగా ఉంది. ఈ బాక్టీరియా వ్యాధి ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అయితే 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లల్లో ఈ వ్యాధి సాదారణం.
  • ఇన్ఫెక్షన్ జర్నల్ లో ప్రచురించిన 2007 అధ్యయనంలో స్కార్లెట్ జ్వరంతో బాధపడుతున్న 45 మందిలో 30 మందికి నాలుక స్ట్రాబెర్రీ ఎరుపు రంగులో ఉందని తెలిపింది.

English summary

You will be surprised at the number of things your tongue might suddenly reveal, once you know what to look for.