బ్రహ్మోత్సవంలో అన్ని కట్టింగులా..?

Too Many Cuts For Brahmotsavam Movie

06:42 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Too Many Cuts For Brahmotsavam Movie

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా ఎక్కువ సమయంతో చిత్రికరించాడట. ఇప్పటి వరకు జరిగిన ఎడిటింగ్‌కు ముందు ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 45 నిమిషాలు ఉందట , పైగా ఇంకా షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉండడంతో , ఇంకా చిత్రికరించాల్సిన సీన్లు కుడా కలిపితే మొత్తంగా ఈ సినిమా నిడివి నాలుగు గంటలకు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మోత్సవం చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ


ఇలా జరగడానికి గల ప్రధాన కారణం దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే అని అంటున్నారు. ఇలా అయితే సినిమా నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని , సినిమాను దాదాపు గంటన్నర కట్‌ చేస్తే ఆ కటింగ్‌ పోయిన సీన్స్‌ అన్నింటికి కూడా ఖర్చు చేసిన డబ్బు వృధా అవుతాయని సినీ విమర్శకులు అంటున్నారు. ఇంతకు ముందు కుడా శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ కోసం ఎక్కువ మొత్తంలో సీన్స్‌ను చిత్రీకరించాడు. కొన్ని సీన్ల ను రెండు రకాలుగా తెరకెక్కించడం శ్రీకాంత్‌ అడ్డాలకు ప్రత్యేకత . కాగా మొత్తం సినిమాను ఇప్పుడు ఎడిట్‌ చేయాలంటే ఎడిటర్‌కు చాలా పెద్ద పని పడినట్లే .ఈ సినిమా వేసవి కానుకగా వచ్చే నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సర్దార్ పై పూరి సెట్టైర్లు

రకుల్ కి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరో

మహేష్ ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో తెలుసా.?

బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

English summary

Super Star Mahesh Babu was Presently acting in "Brahmotsavam" movie under the direction of Director Srikanth Addala. This movie running time was going very much because Srikanth Addala will shoot a single scene in two ways.