తెలుగులో 175 రోజులు ఆడిన సినిమాలు

Top 10 175 days telugu movies

03:53 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Top 10 175 days telugu movies

ఇప్పుడు సినిమాలు ఎంత ఎక్కువ కలెక్షన్లు రాబడితే అంత పెద్ద హిట్‌ అంటున్నారు. కానీ ఒకప్పుడు సినిమాలంటే ఎంత ఎక్కువ రోజులు ఆడితే అంత పెద్ద హిట్‌ అని లెక్క. అప్పటి సినిమాలు 100 రోజులు, 175 రోజులు, 365 రోజులు కూడా ఆడేవి. అలా మన తెలుగులో 175 రోజులు ఆడిన సినిమాని సిల్వర్‌ జూబ్లీ అంటారు. ఇప్పటివరకు మన టాలీవుడ్‌లో అత్యధిక సెంటర్లలో సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకుని దుమ్ము రేపిన టాప్‌ 10 చిత్రాలు మీ కోసం.

1/11 Pages

10. లవకుశ: (13 సెంటర్లు)


స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రం 'లవకుశ'. 1963 మార్చి 29న విడుదలైన ఈ చిత్రానికి సి. పుల్లయ్య, సి.ఎస్‌. రావు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్‌ రాముడు పాత్రలో నటించగా, అంజలీ దేవి సీతాదేవిగా నటించారు. ఇందులో మొత్తం 27 పాటలు ఉంటాయి. ఘంటసాల, కె.వి.మహదేవ్‌ కలిసి సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం 13 సెంటర్లలో 175 రోజులు ఆడింది. 

English summary

Top 10 175 days telugu movies in our telugu industry. The movies which was runned succesfully upto 175 days in much centres.