న్యూ ఇయర్ లో స్మార్ట్ స్మార్ట్‌గా

Top 5 Upcoming Smart Phones In 2016

12:38 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Top 5 Upcoming Smart Phones In 2016

స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు మనిషి జీవితంలో నిత్యాసరాల్లో ఒకటి. నిద్ర లేచింది మొదలు.. పడుకునే వరకు చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు నిత్యం టచ్ లో ఉండేందుకు ఇదే కావాలి. గత ఏడాది కొత్త కొత్త ఫోన్లు మార్కెట్ ను ముంచెత్తాయి. ముంచెత్తుతున్నాయి. మరికొన్ని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమన్నాయి. మరి కొత్త సంవత్సరంలో సరికొత్త మొబైల్స్ ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఫోన్ తయారీ సంస్థలు రెడీ అయ్యాయి. కొత్త ఫీచర్లు, సరికొత్త వేరియంట్లతో వస్తున్న అవేంటో ఒకసారి చూద్దాం..

యాపిల్ ఐఫోన్‌ 7, 7 ప్లస్‌

ప్రఖ్యాత యాపిల్‌ సంస్థ నుంచి రానున్న కొత్త మొడైల్స్ ఐఫోన్‌ 7, 7 ప్లస్‌. వాటర్‌ఫ్రూఫ్‌ సదుపాయం, ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ సెప్టెంబర్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 7, ఎస్‌ 7ఎడ్జ్‌

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ నుంచి గెలాక్సీ ఎస్‌ 7, ఎస్‌ 7ఎడ్జ్‌ ఫోన్లను విడుదల చేయనుంది. 3డీ టచ్‌, ప్రెజర్‌ సెన్సిటీవ్‌ ఫీచర్లతో దీన్ని రూపొందించారు. 124 జీబీ వరకు ఇంటర్నల్‌ మెమొరీని అందించనుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌ 6

సోనీ సరికొత్త ఫీచర్లతో ఎక్స్‌పీరియా జెడ్‌6ని తీసుకురానుంది. ఈ ఫోన్‌లో అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, సమర్థవంతమైన బ్యాటరీ, వాటర్‌ ఫ్రూఫ్‌ ఫీచర్లను అందిస్తోంది.

లెనోవో కే4 నోట్‌

చైనా దిగ్గజం లెనోవో ఈ ఏడాది విడుదల చేసిన కే3 నోట్‌కు సక్సెసర్ కే4 నోట్ ను విడుదల చేయనుంది. కిల్లర్‌ డిస్‌ప్లే ఫీచర్‌ కలిగిన ఈ ఫోన్‌ మరికొద్ది రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

షియోమీ ఎంఐ5

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియామీ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్‌ ఎంఐ5 తీసుకొస్తోంది. దీనిలో 16 మెగాపిక్సెల్‌ కెమెరా, 4 జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 802 ప్రాసెసర్, ఫుల్ మెటల్ బాడీ మొదలైన ఫీచర్లు ఉండనుంది.

వీటితో పాటు మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ఫోన్‌, వన్‌ప్లస్‌ 3, వన్‌ప్లస్‌ మినీ, ఆండ్రాయిడ్‌ వన్‌, హెచ్‌టీసీ వన్‌ ఎం10, ఎల్‌జీ జీ5, నెక్సస్‌ 5, నెక్సస్‌ 6 ఫోన్లు కూడా ఈ ఏడాది మార్కెట్ లోకి రానున్నాయి.

English summary

Here are the list of smart phones which was going to release in the new year 2016