అతిలోక సుందరికి అసాధారణ ప్రతిభా పురస్కారం

Top actress Sridevi receiving outstanding achievement award in iifa

11:40 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Top actress Sridevi receiving outstanding achievement award in iifa

బాలనటి నుంచి అగ్రశ్రేణి తార దాకా ఎన్నో మజిలీలు చూసిన ప్రముఖ నటి శ్రీదేవికి ఈ నెల 23 నుంచి 26 తేదీలలో జరగనున్న 17వ ఐఫా అవార్డుల కార్యక్రమంలో అసాధారణ ప్రతిభా పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. 1975లో జూలీ అనే చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి ఆ తరువాత ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. తన సినీ కెరీర్ లో శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటించింది. వివాహం అనంతరం కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి 52 ఏళ్ల వయసులో సద్మా, మిస్టర్ ఇండియా, లమ్హే, చాందిని, ఛాల్ బాజ్, ఖుదాగవా, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి పలు చిత్రాల్లో చిరస్మరణీయమైన నటన ప్రదర్శించారు.

ఎందరో అభిమానుల హృదయంలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న శ్రీదేవికి సినీ పరిశ్రమలో సైతం సెన్షేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో సహా ఎందరో ఆరాధించే అభిమానులున్నారు.

English summary

Top actress Sridevi receiving outstanding achievement award in iifa