యవ్వనంగా ఉండటానికి యాంటీ-ఏజింగ్ ఆయిల్స్

Top anti aging oils

10:25 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Top anti aging oils

వయస్సు పెరుగుతున్నప్పుడు చర్మంలో నూనెల ఉత్పత్తి తగ్గుతుంది. అలాంటప్పుడు చర్మం సాగటం,లైన్స్ ఏర్పడటం మరియు ముడతలు రావటం జరుగుతుంది. కానీ కొంచెం శ్రద్ద పెడితే చర్మాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా యవ్వనంగా మార్చవచ్చు. చర్మం మృదువుగా మరియు తేమగా ఉండాలంటే తగినంత నూనెలు అవసరం. అందుకే ఇప్పుడు అటువంటి యాంటీ-ఏజింగ్ నూనెల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. అర్గన్ నూనె

ఈ నూనెను మొరాకో చెట్టు నుండి సేకరిస్తారు. ఈ నూనెలో ఉండే 80 శాతం కొవ్వు ఆమ్లాలు యాంటీ-ఏజింగ్ ప్రయోజనాలను అందించటానికి మరియు స్వేచ్ఛారాశుల మీద పోరాటం చేయటానికి సహాయపడతాయి. ఈ నూనెలో విటమిన్లు ఎ,ఇ సమృద్దిగా ఉండుట వలన ముడతలు,వయస్సు మచ్చలు,సాగిన చర్మం,లైన్స్ తగ్గించటానికి మరియు చర్మాన్ని తేమగా ఉంచటానికి, చర్మ స్థితిస్థాపకత పెంచటం, అతినీలలోహిత (UV) కిరణాల వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ నూనె చర్మంలో బాగా కలిసిపోతుంది. అంతేకాక అన్ని రకాల చర్మాల వారికీ అనుకూలంగా ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు కొన్ని చుక్కల అర్గన్ నూనెను తీసుకోని ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. అలాగే రోజువారీ ఆహారంలో ఒక స్పూన్ అర్గన్ నూనెను జోడించవచ్చు.

English summary

Here some best anti-aging oils for younger looking Skin. When used topically on the skin, it stimulates the production of collagen, which gives your skin a youthful glow with a smooth texture. Follow these steps you get beautiful texture.