శేఖర్ రెడ్డి అరెస్టుతో మరో టాప్ బిజినెస్ మేన్ దొరికేసాడు (వీడియో)

Top Businessman Arrested By ED Officers

05:19 PM ON 23rd December, 2016 By Mirchi Vilas

Top Businessman Arrested By ED Officers

పెద్ద నోట్ల రద్దు, నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్లాక్ మనీ గురించి విస్తృతంగా జరుగుతున్నరైడ్ లలో భాగంగా కోల్ కతాకు చెందిన టాప్ బిజినెస్ మేన్ పర్సామల్ లోధాను ఎన్ ఫోర్స్ మెంట్ - ఈడీ గురువారం అరెస్టు చేసింది. 25 కోట్లు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు ప్రయత్నించినందుకు ఆయన్ని ముంబై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. లోధా.. రియల్ ఎస్టేట్ , మైనింగ్ వ్యాపారాలు కూడా చేస్తాడట.

అంతేకాదు రీసెంట్ గా లాయర్ రోహిత్ టాండన్ ఆఫీసులో పెద్ద మొత్తంలో మనీ దొరకింది. ఆ నగదు తనదికాదని బిజినెస్ మేన్ లోధా పేరు చెప్పడంతో అలర్టయిన అధికారులు ఆయనపై లావాదేవీలపై కన్నేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి బ్లాక్ మనీని వైట్ గా మార్చడంలో లోధా సహకరించినట్లు అంతర్గత వర్గాల ద్వారా తేలిందట. ఇటీవల లోధా తన కూతురు మ్యారేజ్ ని కళ్లు చెదిరేలా చేశాడు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అప్పటినుంచే లోథాపై ఐటీ అధికారులు కన్నేసి ఉంచారు. ఇప్పటికే శేఖర్ రెడ్డి బుధవారం అరెస్ట్ కాగా, తాజాగా లోధా వంతైంది. ఇక శేఖర్ రెడ్డి నోరు విప్పితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు రావడం ఖాయమని వినిపిస్తోంది.

English summary

Top Kolkata Businessman Arrested By ED Officers.