టాప్ హీరోహీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్లు... ఆపై విడాకులు

Top hero heroines love marriages and divorces

11:44 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Top hero heroines love marriages and divorces

ప్రపంచ దేశాల్లో ఉన్న వివాహ చట్టాలకంటే మన దేశంలో ఉన్న హిందూ వివాహ చట్టానికి ఎంతో గుర్తింపు ఉంది. ధర్మార్ధ కామ మోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్దం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. మన దేశ వివాహ సంప్రదాయానికి ఇతర దేశాలకు చాలా వ్యత్యాసం వుంది. అక్కడ పెళ్లి చేసుకుని సహజీవనం జరిపి ఇష్టం లేకపోతే వెంటనే విడిపోవచ్చు. కానీ మన దేశంలో మాత్రం దీనికి భిన్నం. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఒక్కసారి పెళ్లి చేసుకున్న అనంతరం ఏ కారణం చేతనైనా విడిపోవాలనుకుంటే చట్ట ప్రకారం విడిపోవాల్సిందే.

లేకపోతే ఇరువురు శిక్షార్హులుగా పరిగణిస్తారు. ఈ విషయం సినీమా ఇండస్ట్రీలో పనిచేసేవారికి కూడా బానే తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుదంటే ఎక్కువశాతం సినీమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న అగ్రహీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల పెళ్లిలు మధ్యలోనే తెగిపోతున్నాయి. వీరి ప్రేమ పెళ్లి దాకా వచ్చినా.. అది మధ్యలోనే తెగతెంపులు చేసుకుంటున్నారు. ఈ తంతూ ఇప్పుడని అప్పుడని చెప్పలేం. తాజాగా అమలా పాల్ విడాకుల వ్యవహారం తెరపైకి రావడంతో మరోసారి సినీమా ఇండస్ట్రీ ప్రేమ పెళ్లి, విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. తారల రీల్ లైఫ్ ప్రేమలతో పోలిస్తే, రియల్ లైప్ ప్రేమలపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు.

వీరి సినిమాలో ఉన్న ట్విస్టుల కంటే నిజ జీవితంలోనే ఎక్కు వ ట్విస్టులుంటున్నాయి. మూడు గంటల సినిమా కథల్లానే తారల నిజ జీవితపు ప్రేమ బంధాలు ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. నాడు సావిత్రి, శారద, ఆతర్వాత అక్కినేని నాగార్జున, ఇప్పుడు అమలాపాల్-దర్శకుడు విజయ్ వరకు ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో చాలానే కనిపిస్తాయి.

1/8 Pages

సుమంత్-కీర్తి రెడ్డిల విడాకులు


అక్కినేని నాగార్జున మేనల్లుడైన సుమంత్ తన సహచర నటి తొలిప్రేమ ఫేం కీర్తిరెడ్డిల వ్యవహారంలోకి వెళ్తే వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నా, పెద్దమనషుల ఒప్పందతోనే వివాహం చేసుకున్నారు. బొద్దుగా, సాంప్రదాయంగా ఉండే కీర్తి రెడ్డి సినీమా ఇండస్ట్రీలో అనుకున్నంత విజయం సాధించలేదు. ఇదే పరిస్థితి సుమంత్ కు సైతం ఏర్పడింది. ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా ఆ తరువాత సుమంత్ సినిమాలకు ఆదరణ కరువైంది. దీంతో వీరిద్దరు పెద్దల సమక్షంలో 2004లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. సరైన కారణాలు తెలియవు కానీ. ఈ జంట 2006లో విడిపోయింది. ఆ తరువాత కీర్తి రెడ్డి ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసి, వెళ్ళిపోయింది.

English summary

Top hero heroines love marriages and divorces