టాప్ హీరోలంతా కనిపించే ‘శతమానం భవతి’

Top Heroes In Sathamanam Bhavathi Movie

11:22 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Top Heroes In Sathamanam Bhavathi Movie

పండగ వస్తోందంటే, అందరికీ ఆనందమే ... ఇక సినీ అభిమానులకు మరింత సందడి. అందునా పెద్ద పండగ సంక్రాతి సందర్బంగా పెద్ద హీరోల సినిమాలైన ‘ఖైదీనెంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాల మధ్య తన సత్తా చాటడానికి ‘శతమానం భవతి’ సంక్రాంతికే వస్తోంది. శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా కనిపిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. పెద్ద సినిమాల మధ్య వస్తున్న ఈ చిన్న సినిమాలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ మూవీలో తెలుగు సినీ పరిశ్రమ టాప్ హీరోలందరూ ఓ సీన్ లో కనిపిస్తారట. మహేష్ , ఎన్టీయార్ , బన్నీ.. ఇలా అందరూ ఉంటారట. అయితే నిజంగా వారు ఈ సినిమాలో నటించడం లేదు. కానీ, దిల్ రాజు వేసిన ఓ మాస్టర్ ప్లాన్ వల్ల ఇది సాధ్యమైందట. వివిధ సినిమాల్లోని ఆయా హీరోల డైలాగ్ వీడియోలను కట్ చేసి ఈ సినిమాలో వాడుతున్నారట. ఆ బిట్ లన్నింటినీ ఓ సీన్ గా మార్చి వారు నిజంగా మాట్లాడుకున్నంత సహజంగా రూపొందించారట. స్పెషల్ ఎట్రాక్షన్ కోసం స్టార్ హీరోల చేత క్యామియో రోల్స్ వేయించడం చూశాం కానీ, ఇలా అందర్నీ ఒకే సీన్ లో చూపించాలనే ఐడియా మాత్రం కొత్తదే. ఈ సీన్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నారట. .

ఇవి కూడా చదవండి: వామ్మో, దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు ఇదేనట

ఇవి కూడా చదవండి:బన్నీని రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్ (వీడియో)

English summary

Hero Sharwanand's new film Shatamanam Bhavathi movie was going to release on this festival and there was some special attractions in this movie. Top heroes Tollywood to be appear in this Movie.