టాప్‌ స్పీడ్‌ బుల్లెట్ ట్రైన్స్‌ ఇవే

top speed bullet trains around the world

12:52 PM ON 13th December, 2015 By Mirchi Vilas

top speed bullet trains around the world

జపాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని జపాన్‌ బుల్లెట్‌ రైళ్ళను దేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 98వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్న మోడీ వచ్చే నాలుగైదేళ్ళలో బుల్లెట్‌రైళ్ళను దేశంలోని రైలు పట్టాలపై పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ రైల్వేల రూపురేఖల్ని సమూలంగా మార్చే సత్తా బుల్లెట్‌ రైళ్ళకు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బుల్లెట్‌ రైళ్ళ రాకతో దేశ అభివృద్ధి బండి బుల్లెట్‌ స్పీడుతో దూసుకుపోతుందని ఘంటా పథంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్ళు పరుగులు ప్రారంభించిన దశాబ్ధాల తర్వాత ఇండియాలో వీటిని చూడబోతుండడం కాసింత ఆలస్యమే అయినా ఇప్పటికైనా మన పాలకులు ఆ దిశగా అడుగులు వేయడం ముదావహం. జపాన్‌ మాత్రమే కాక పలు దేశాలు బుల్లెట్‌ రైళ్ళను విజయవంతంగా నడుపుతూ అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్‌ స్పీడ్‌తో నడిచే కొన్ని రైళ్ళ వివరాలను తెలుసుకుందాం. 

1/11 Pages

10. హెచ్‌ఎస్‌ఎల్‌ 1, బెల్జియం, స్పీడు గంటకు 300కి.మీ

బెల్జియం ప్రభుత్వం నడుపుతున్న హెచ్‌ఎస్‌ఎల్‌1 అనే ట్రైన్‌ గంటకు 300కి.మీ నడుస్తుందట. బెల్జియంలోని బ్రస్సెల్స్‌ నుండి ఎల్‌జివి నార్డ్‌ అనే ప్రాంతాల మధ్య నడిచే ఈ ట్రైన్‌ 88కిలో మీటర్ల ప్రత్యేక మార్గంలో నడుపుతున్నారు. 1997 నుండి ప్రారంభమైన ఈ ట్రైన్‌ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఈ ట్రైన్‌ రాకతో పారిస్‌ నుండి బ్రస్సెల్స్‌కు మధ్య దూరం చాలా తగ్గిపోయిందట. కేవలం ఒక గంట 22 నిముషాల వ్యవధిలో ఈ రైలు బ్రస్సెల్స్‌ నుండి పారిస్‌కు తీసుకుపోగలదు. 

English summary

Several countries in the world are trying to make the fastest train in the world. Some of the trains is still in service