జీవితంలో తప్పక చూడాల్సిన చారిత్రక కట్టడాలు

Top Tourist Places in India

07:21 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Top Tourist Places in India

భారత దేశంలో ప్రధాన భాగమైన చారిత్రక నిర్మాణాలు చూడటంలో ఉత్సాహులైన వారు పొందుపరచిన  15 ప్రదేశాలు వివరాలు
ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం.  
1. క్రిమ్చి: క్రిమ్చి అనేది జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్ జిల్లాలో  చిన్న గ్రామం. ఇక్కడ బాగా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ముఖ్యముగా పాండవ రాజులు కట్టించిన ఆలయాలు బాగా ప్రసిద్ధం. ఇంకా ఇక్కడ పంచెరి, హిల్ రిసార్ట్ కూడా మీరు చూడవచ్చు.


ఎలా వెళ్ళాలి: జమ్మూ తావి అనే ఊరు జమ్మూకి బాగా దగ్గరగా ఉంటుంది. అక్కడకి రైలులో వెల్లవచ్చు. జమ్మూ తావిలో దిగి అక్కడ నుండి ట్యాక్సీలో క్రిమ్చి చేరుకోవచ్చు.
వసతి సధుపాయాలు: మీ అవసరాలు బట్టి మీ బడ్జెట్కి సరిపోయే వసతి గృహాలు, లగ్జరీ, ఐదు నక్షత్రాల వసతి గృహాలు అక్కడ ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలంలో ఇక్కడకి వెళ్ళవచ్చు. ఆ మాసంలో ఇక్కడ మంచు కురవడం కూడా మీరు చూడొచ్చు.

2. కంగ్రా: హిమాచల్ ప్రదేశ్లో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఈ కంగ్రా లోయ కూడా ఒకటి. పిరమిడ్ - మశ్రూర్ రాక్ కట్ ఆలయానికి కంగ్రా  నిలయం. వీటితో పాటు మీరు సందర్శించవల్సిన ప్రదేశాలు, కంగ్రా ఫోర్ట్, తరాగర్ః ప్యాలేస్, ఇంద్రహర్ పాస్ మరియు కారెరీ లేక్.

 ఎలా వెళ్ళాలి: చండిగర్, జమ్మూ , అమృత్సర్ అనేవి కంగ్రా దగ్గరగా ఉన్న విమానాశ్రయాలు. వీటితో పాటు బస్ సదుపాయం కూడా ఉంది.

వసతి సధుపాయాలు: ఇక్కడ అందమైన ప్రదేశాల్లో వసతి గృహాలు మరియు అతిధి గృహాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: మార్చ్ నుండి జూన్లో వెళ్ళడం ఈ సందర్శనకు సరైన సమయం.

3. కజురాహో సమూహ కట్టడాలు: ఈ సమూహ కట్టడాలు మధ్యప్రదేశ్లో   ఛాతర్పూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ సుందర సమూహ కట్టడాలు హిందూ మరియు జైన్ మతస్తులకు సంబంధించినవి. వీటిలో ప్రసిధ్ధమైన కామకేళి శిల్పాలు నగర తరహా నిర్మాణంలో చెక్కారు.

ఎలా వెళ్ళాలి: ఇక్కడకి వెళ్ళడానికి సరైన మార్గం విమానం మరియు బస్. కజురహో విమానాశ్రయమ్ కజురహో కట్టడాలకి సమీప మార్గం.

వసతి సదుపాయాలు: ఇక్కడ లగ్జరీ వసతి గృహాలు ఉంటాయి.  మధ్య ప్రదేశ్ పర్యాటక సంస్థ సామాన్యులకి అందుబాటు ధరల్లోనే ఇక్కడ హొటల్స్ నడుపుతోంది.
సందర్శనకు సరైన సమయం: ఇక్కడకి వెళ్లాల్సిన సరైన సమయం శీతాకాలం.

4.  జగేశ్వర్: ఉత్తరాఖండ్లో అల్మోర్ జిల్లాలో ఈ జగేశ్వర్ అనే అందమైన యాత్రికా ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో మొత్తం 124 చిన్న ఆలయాలు ఉన్నాయి.


ఎలా వెళ్ళాలి:  ఇక్కడకి రోడ్, ట్యాక్సీ, మీ సొంత వాహనాల్లో వెళ్ళవచ్చు. జాగేశ్వర్ కి  సమీప రైల్వే స్టేషన్ అల్మోర్.
వసతి సధుపాయాలు: చాలా తక్కువ సదుపాయాలు ఉంటాయి. కాని మంచి సదుపాయాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం:  సంవత్సరంలో ఏ మాసంలోనైనా వెళ్ళవచ్చు.
5. అయోధ్య: అయోధ్య, దేవుడైన శ్రీరామచంద్రుని జన్మ స్థలము. ఇది ఉత్తర ప్రదేశ్ లో  ఉన్న ఫైజాబాద్ పక్క పట్టణంలో ఉంది. అయోధ్యకి చాలా గొప్ప చరిత్ర ఉంది, ఈ పట్టణంలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి.


ఎలా వెళ్ళాలి: రైలు మరియు బస్ దీనికి ఉత్తమ మార్గం. దీనికి సమీప రైల్వే స్టేషన్ లక్నోలో ఉంది.
వసతి సధుపాయాలు: ఇక్కడ ఉండడానికి ధర్మశాలలు, వసతి గృహాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం:  ఇక్కడకి వెళ్ళడానికి సరైన సమయం శీతాకాలం.

6. వారణాసి: వారణాసి పవిత్ర నది అయిన గంగా నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ లో  ఉంది. దీనిని బాగా పురాతన పట్టణము అని కూడా పిలుస్తారు. ఇది కనుమలుకు మాత్రమే ప్రసిద్ధము కాదు.  ఇక్కడ నివసించే రంగుల మరియు ప్రకాశవంతమైన జీవితాలు గడిపే మనుషులు కోసం కూడా.


ఎలా వెళ్ళాలి: రైలు, విమానము, రోడ్డు మీకు సదుపాయము బట్టి వెళ్ళవచ్చును.
వసతి సదుపాయాలు: అక్కడ కనుమలు
చుట్టూ ఆశ్రమాలు నెలకొల్పినవి, మరియు లగ్జరీ వసతి గృహాలు, బస నివాసాలు అందుబాటులో ఉన్నవి.
సందర్శనకు సరైన సమయం: ఇది చూచుటకు శీతాకాలమే సరైన సమయం.
7. భీమేత్క రాతి ఆశ్రయాలు: మానవ చరిత్రలో మరో పురావస్తు చోటైన భీమేత్క రాతి ఆశ్రయాలు మధ్య ప్రదేశ్ లో  రైసెన్ జిల్లాలో ఉంది. ఈ చోటు పూర్వ శిలాయుగం లో జీవించిన  వారిది.

 

ఎలా వెళ్ళాలి: అక్కడ రాజ భోజ్ అనే విమానాశ్రయము ఉంది అక్కడకి వెళ్లుటకు అదే సమీప విమానాశ్రయము. అక్కడ నుండి ట్యాక్సీలో చేరుకోవచ్చు. అక్కడకి వెళ్లుటకు సమీప రైల్వే స్టేషన్ భోపాల్లో ఉన్నది.
వసతి సదుపాయాలు: మీ ఖర్చుకి సరిపోయేటటువంటి స్నేహపూర్వక వసతి గృహాలు అక్కడ ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: ఇక్కడకి వెళ్లుటకు శీతాకాలమే సరైన సమయం.
8. కురుక్షేత్ర: ఇది హర్యానా రాష్ట్రంలో ఉన్నది. ఇది గొప్ప మత మరియు చారిత్రక ప్రదేశం . గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి  గీత భోధించిన గొప్ప భూమి. ఇక్కడ చారిత్రక ప్రదేశాలైన బ్రహ్మ సరోవర్, శ్రీ కృష్ణ మ్యూజియం, భీష్మ ఖున్ద్ కూడా ఉన్నవి.


 ఎలా వెళ్ళాలి: సమీప విమానాశ్రయము డిల్లీలో ఉన్నది. ఇక్కడకి బస్ మరియు ట్యాక్సీ ల లో  కూడా చేరుకోవచ్చు. కురుక్షేత్రకి రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చును.
వసతి సదుపాయాలు: అందుబాటు ధరలకే వసతి గృహాలు మరియు ధర్మశాలలు ఇక్కడ ఉన్నవి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలం.
9. పానీపట్: పానీపట్ కి  ఒక పురాణ చరిత్ర ఉంది . ఇది హర్యానాలో ఉన్నది. మహాభారత కాలంలో పాండవ సోదరులు దీన్ని కనుగొన్నారు . ప్రసిద్ధ యుధ్ధాలు జరిగిన ప్రదేశం గా ఇది పేరు గాంచింది . ఇంకా ఇక్కడ చూడటానికి పానీపట్ మ్యూజీయమ్, గ్రేవ్ ఆఫ్ ఇబ్రహీం లోధి, కబులి బాగ్ మరియు కల అంబ్ కూడా ఉన్నవి.


ఎలా వెళ్ళాలి: అక్కడకి బస్, రైలు మరియు విమాన మార్గంలో వెళ్ళవచ్చును.
వసతి సదుపాయాలు:  బాగా సంరక్షించిన వసతి గృహాలు మీ అందుబాటులో లభిస్తాయి.
సందర్శనకు సరైన సమయం: నవంబర్, డిసెంబర్ మరియు జనవరి.
10. గ్వాలియర్: ఈ చారిత్రక కట్టడం మధ్య ప్రదేశ్లో ఉన్నది. భారత చరిత్రలో ముఖ్య ప్రదేశాలలో  గ్వాలియర్ ప్రదేశం తనదైన ముద్ర వేసుకున్నది. ఇంకా చూడాల్సినవి గ్వాలియర్ ఫోర్ట్, రాజా మాన్ సింగ్ టోమర్స్ ప్యాలేస్, స్సీన్డియా మ్యూజీయమ్ మరియు గోపాచల్ పర్వట్.


 ఎలా వెళ్ళాలి:  బస్ మరియు రైలు మార్గాలు సరైనవి.
వసతి సదుపాయాలు: చాలా లగ్జరీ వసతి గృహాలు మరియు మీ బడ్జెట్ వసతులు అక్కడ దొరుకుతాయి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలం.
11. వృందావన్: వృందావన్ ఉత్తర ప్రదేశ్లో మధుర నగరిలో ఉన్నది. దీనిని కృష్ణ భూమి అని కూడా పిలుస్తారు. ఇక్కడ దేవుళ్లైన రాధాకృష్ణ  ఆలయాలు చాలా నిర్మించారు. ఇవి  హిందువులకి పవిత్ర స్థలాలు.


ఎలా వెళ్ళాలి: బస్ మరియు రైలు మార్గంలో వెళ్ళవచ్చు. ఇక్కడ సమీప రైల్వే స్టేషన్ మధురలో ఉన్నది.
వసతి సదుపాయాలు: ఇస్కాన్ ఆలయం వద్ద అతిధి గృహాలు, చుట్టూ వసతి గృహాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలం. 
12. కర్నల్: మీరు మహాభారతము చదివినట్లైతే హర్యానాలో మీరు చూడవల్సిన మరో ప్రదేశం కర్నల్. దీనిని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇంకా అక్కడ చూడవల్సిన ప్రదేశాలు కర్నల్ ఫోర్ట్, కర్నల్ లేక్, క్యాంటోన్మెంట్ చర్చ్ టవర్ మరియు  పుక్కా పుల్.


ఎలా వెళ్ళాలి: బస్ మరియు రైలు మార్గంలో వెళ్ళవచ్చు.
వసతి సదుపాయాలు: మీ బడ్జెట్లో వసతి గృహాలు మంచి సదుపాయం.
సందర్శనకు సరైన సమయం: అక్టోబర్ నుంచి మార్చ్ లో  ఎప్పుడైనా వెళ్ళవచ్చు.
13. హిసర్: ఈ చారిత్రక ప్రదేశం హర్యానాలో ఉన్నది. దీని ముందు చారిత్రాత్మక మనిషి  ఉనికి ఆధారాలు ఉన్నవి. ఇంకా ఇక్కడ చూడవల్సిన స్మారక ప్రదేశాలు బనవాళి, గుంబద్, ఫోర్ట్ ఆఫ్ పృథ్వీరాజ్ మరియు దేవి భవన్ మందిర్.


 ఎలా వెళ్ళాలి:  బస్ లు  మరియు రైలు మార్గంలో వెళ్ళవచ్చు.
వసతి సదుపాయాలు: వసతి గృహాలు మరియు అతిధి గృహాలు లభించును.

 సందర్శనకు సరైన సమయం: సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చును.
14. అల్వార్: ఇది రాజస్థాన్లో ఉన్నది. ఇక్కడ కోటలు, అందమైన ప్రదేశాలు ఉన్నవి. దీనిని గంభీర పట్టణము అని కూడా పిలుస్తారు. అల్వార్లో భంగర్ ఫోర్ట్ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. 


ఎలా వెళ్ళాలి:  జైపూర్లో ఉన్న సమీప విమానాశ్రయము సంగానేర్ విమానాశ్రయము. ట్యాక్సీస్, రైలు మరియు రోడ్డు ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది.
వసతి సదుపాయాలు: అందమైన రాజభవనాలు వసతి గృహాలుగా మార్చబడినవి. అందుబాటులో వసతి గృహాలు మరియు లగ్జరీ వసతి గృహాలు కూడా ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చును.
15. హన్సీ: హన్సీ ఒక చారిత్రక నగరం. ఇది హర్యానాలో ఉంది. చాలా భవనాలు పురావస్తు అంశాల ఆసక్తితో కట్టబడినవి. హన్సీలో చాలా పురాతనమైన కోటలు, బుద్డిని విగ్రహాలు మరియు జైన్ మత దేవుడైన మహావీర్ విగ్రహాలుఉన్నవి.

ఎలా వెళ్ళాలి: నిత్య బస్లు మరియు రైలు మార్గంలో వెళ్ళవచ్చు.
వసతి సదుపాయాలు: అందుబాటు ధరల్లోనే వసతి గృహాలు లభించును.
సందర్శనకు సరైన సమయం: డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చును.
ఇవండి మన దేశ చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు.... ఇంకెందుకు ఆలస్యం త్వరగా సందర్శించండి మరి.

1/1 Pages

English summary

Top Tourist Places in India. Top 15 tourist places in south India, these are the most historic, archaeologic and religious beautiful places in India.