టాప్ ట్విట్టర్ ట్రెండ్స్ ఇవే..

Top Twitter Trends Of 2015

04:55 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Top Twitter Trends Of  2015

2015కి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేస్తోంది. ఈ సమయంలో ట్విట్టర్ ఇండియా.. 2015లో ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ను, ఎక్కువగా రీట్వీట్ చేసిన ట్వీట్, మోస్ట్ పాపులర్ ట్వీట్‌లను ప్రకటించింది. గోల్డెన్ ట్వీట్ ఘనత బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్‌కు దక్కింది. లండన్‌లో జరిగిన ఏషియన్ అవార్డ్స్ కార్యక్రమంలో షారుక్ ఖాన్ ప్రముఖ ఇంగ్లిష్ సింగర్ జైన్ మాలిక్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి అత్యధికంగా 1,41,000పైగా రీట్వీట్స్, 18.3 మిలియన్ వ్యూస్, 2లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఏప్రిల్ 17న చేసిన ఈ ట్వీట్ గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది.

'ఇయర్ ఆన్ ట్విట్టర్ 2015' రిపోర్టు ప్రకారం బాలీవుడ్ హీరో అమితాబ్ 18.1 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత షారుక్‌ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి..

- ట్విట్టర్‌లో మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ క్రీడలు, వినోదం, రాజకీయం, సామాజిక కార్యక్రమాల మిశ్రమంగా ఉన్నాయి.

- పాపులర్ హాష్‌ట్యాగ్స్.. ఐపీఎల్, సెల్ఫీవిత్ డాటర్(కూతురుతో సెల్ఫీ), బిహార్ ఎన్నికల ఫలితాలు, మోదీ ఏడాది పాలన, దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు 20ఏళ్లయిన సందర్భం.

- 2015లో ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపించిన అంశాలు.. ఎక్కువగా ప్రజలు భాగస్వాములై ట్వీట్లు చేసిన సందర్భాల హ్యాష్‌ట్యాగ్స్ .. క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచులు, ఢిల్లీ ఎన్నికలు, దీపావళి శుభాకాంక్షలు, చెన్నై వర్షాలు, భారత స్వాతంత్య్ర దినోత్సవం.

- మేక్ ఇన్ ఇండియా హ్యాష్‌ట్యాగ్- అమెరికా బ్రాండ్ కాకుండా సొంతగా ట్విట్టర్ ఇమోజీ పొందిన తొలి హ్యాష్‌ట్యాగ్

English summary

The top twitter trends of 2015 year were released recently. In this bollywood hero shahrukh khan tweets stands as a Golden Tweet in the list with 1,41,000 retweets, 18.3 million views, 2lakh likes