ఆ ఛానల్ లో యాంకర్లు టాప్ లెస్ గా వార్తలు చదువుతారట!(వీడియో)

Topless anchors read news in channel

05:43 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Topless anchors read news in channel

అవును మీరు చూసింది నిజమే ఆ న్యూస్ ఛానల్ యాంకర్లు టాప్ లెస్ గా వార్తలు చదువుతారు. అయితే ఇది మన భారతదేశంలో కాదు లెండీ, అల్బానియాలో.. వివరాల్లోకి వెళితే.. ఈ పోటీ ప్రపంచంలో ఎందులో అయినా పోటీనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే న్యూస్ ఛానల్ లో కూడా ఆ పోటీ తప్పకుండా ఉంటుంది. అయితే అల్బానియాలో అయితే న్యూస్ ఛానల్ మధ్య పోటీ మరింత ఎక్కువట. అందుకే ఫైర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చెయ్యడానికి వార్తలని టాప్ లెస్ యాంకర్లతో చదివిస్తుంది. దీనికి 'నేకడ్ ట్రూత్' అని కాప్షన్ కూడా పెట్టారు. అంటే ఆ యాంకరమ్మలు బ్రా, టాప్ లేవీ ధరించకుండా వార్తలు చదువుతారు.

అయితే పైవి పూర్తిగా కనబడకుండా ఓపెన్ బ్లేజర్, కోటు వంటివి ధరిస్తారు. ఇలా వార్తలు చదివే అమ్మాయిలనే ఎక్కువ శాతంలో రిక్రూట్ చేసుకుంటుందట ఈ న్యూస్ ఛానల్. అయితే తొలుత పూర్తిగా టాప్ లెస్ గా వార్తలు చదివించాలని ఆ న్యూస్ ఛానల్ ప్రయత్నించినా, అల్బానియా సాంప్రదాయానికి కట్టుబడి ఆ సాహసం చెయ్యలేదట ఆ ఛానల్. అల్బానియాలో 60 శాతం మంది ముస్లింలు, 20 శాతం మంది క్రిస్టియన్లు ఉంటారట. అయితే ఈ ఛానల్ లో టాప్ లెస్ గా వార్తలు చదువుతున్న హోగ్జాగ్ అనే యాంకర్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె వారానికి సుమారు 2 లక్షల 25 వేల రూపాయలు పారితోషకం తీసుకుంటుందట.

English summary

Topless anchors read news in channel