అమెరికాలో టోర్నడోలు, వరదల విలయం

Tornadoes and floods In America

07:20 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Tornadoes and floods In America

అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు, మెరుపు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా అమెరికాలోని టెక్సాస్‌ సహా దక్షిణాది రాష్ట్రాలను టోర్నడోలు(పెనుగాలులు), తుపానులు కుదిపేస్తున్నాయి. ఈ ప్రకృతి బీభత్సాల్లో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 43కి చేరుకుంది. పెనుగాలుల బీభత్సానికి విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని 50,000 మంది అంధకారంలో గడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. గంటకి 322 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తుండడంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి. మెక్సికో, టెక్సాస్‌, ఓక్లహోమా, కాన్సాస్‌ ప్రాంతాల్లో పెనుగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 1,300 విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

English summary