తోషిబా నుంచి డైనా ప్యాడ్

Toshiba Launched Dynapad Tablet

04:31 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Toshiba Launched Dynapad Tablet

జపాన్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ తోషిబా సరికొత్త టాబ్లెట్ ను ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2016లో తొలిసారిగా దీనిని ప్రదర్శించింది. తోషిబా 'డైనాప్యాడ్' పేరిట‌ రూపొందించిన ఈ సరికొత్త ఫుల్ హెచ్‌డీ టాబ్లెట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీని ధరను సుమారు రూ. 38 వేలుగా నిర్ణయించింది. ఈ నెల చివరి నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. డైనాప్యాడ్ టాబ్లెట్ 12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920*1080 పిక్సల్స్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఇంటెల్ ఆటం ఎక్స్5 జడ్8300 ప్రాసెసర్, 4జీబీ డీడీఆర్3ఎల్ ర్యామ్, 64 జీబీ ఫ్లాష్ స్టోరేజ్, ఎస్డీ కార్డుతో దీనిని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, 0.27 ఇంచుల మందం, 580 గ్రాముల బరువు వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Toshiba electronics company launched a new tablet named Dynapad.It comes with windows 10 operating system. The price of this tablet was apprroximately 30,000