30 వేల కోట్ల నష్టం.. 6,800 ఉద్యోగాలు ఫట్

Toshiba to Cut 6,800 Jobs

05:25 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Toshiba to Cut 6,800 Jobs

సత్యం కంప్యూటర్స్ తరహాలో లాభాలను పెంచి చూపిన కుంభకోణంలో చిక్కుకున్న జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తోషిబా ఇప్పుడు పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పర్సనల్ కంప్యూటర్లు, టీవీలనూ విక్రయిస్తూ గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ సంస్థ ఈ స్కామ్ తర్వాత టెక్ ప్రపంచపు పోటీలో వెనుకబడిపోయింది. ఈ పరినామాల నేపథ్యంలో తోషిబా ఈ ఏడాది దాదాపు 4.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30 వేల కోట్లు) నష్టాల్లో చిక్కుకుంది. అకౌంటింగ్ కుంభకోణంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతుండటంతో, కంపెనీ షేర్లు పది శాతం పడిపోవడం తదితర పరిణామాలతో వేతనాల భారాన్ని తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం దాదాపు 7 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లైఫ్ స్టైల్ బిజినెస్ కు సంబంధించి ముందస్తు పదవీ విరమణ, పదవులను మార్పులు చేయడం మొదలైన సంస్కరణలు చేపట్టనున్నట్టు కంపెనీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఇండొనేషియాలోని టెలివిజన్ తయారీ కేంద్రాన్ని విక్రయించాలని కూడా సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సంస్థను పునర్నిర్మించాలంటే, ఈ ప్రణాళిక అమలు తప్పనిసరని భావిస్తున్నామని, అందరు వాటాదారులు, బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయాలకు ఆమోదం తెలుపుతారని భావిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థ లాభాలను ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల మేర పెంచి చూపించినట్లు వెల్లడి కావడంతో తోషిబాకు ఇక్కట్టు ప్రారంభమయ్యాయి. దీంతో తోషిబా ప్రెసిడెంట్ తో పాటు ఏడుగురు టాప్ ఎగ్జిక్యుటివ్ లు సంస్థ నుంచి వైదొలిగారు.

English summary

Toshiba company record annual loss of $4.5 billion and slash thousands of jobs, as shares in the firm plunged 9.8 per cent.Toshiba to Cut 6,800 Jobs due to that loss