ఆ కుటుంబాన్ని బంగాళదుంపలు బలి తీసుకున్నాయి

Total Family Is Wiped Out Caused By Potatoes

12:29 PM ON 17th September, 2016 By Mirchi Vilas

Total Family Is Wiped Out Caused By Potatoes

ఇదేమిటి బంగాళా దుంపలు బలి తీసుకోవడం ఏమిటి? అవేమైనా బాంబులు అనుకుంటున్నారా అని అనుకోవచ్చు. కానీ అంతకంటే ప్రమాదకరం అంట. కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు కదా. సరిగ్గా ఇది కూడా అలాంటి ఘటనే. ఇంతకీ ఒక మహిళ కిచెన్ లో చేసిన చిన్న పొరపాటు వల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. రష్యాకు చెందిన మేరియా చెలిసేవా అనే 8 సంవత్సరాల పాప కుటుంబం మొత్తాన్ని కోల్పోయి అనాథగా మారింది. అయితే ఆమె కుటుంబం చనిపోయింది ఏ ప్రమాదం సంభవించో, లేదా ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చో కాదు. బంగాళదుంపల కారణంగానే అంటున్నారు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.

ఇంతకీ అసలు విషయమేంటంటే మేరియా తండ్రి సెల్లార్ లో ఉన్న గదిలో నిల్వ ఉంచిన బంగాళదుంపలు తీసుకురావడానికి కిందికెళ్లాడు. ఎంతసేపటికి అతను పైకి రాలేదు. ఎంత సమయమైనా భర్త రాకపోవడంతో మేరియా తల్లి సెల్లార్ లోకి వెళ్లి తలుపు తెరిచి చూసింది. ఆమె తిరిగిరాలేదు. మేరియా అన్నయ్య కూడా కిందకు వెళ్లి తిరిగిరాలేదు. అసలేం జరుగుతుందో మేరియా నాన్నమ్మకు అర్థం కాలేదు. వెంటనే పై నుంచే పొరుగింటి వారిని పిలిచింది. ఫలితం లేకుండాపోయింది. కొద్దిసేపటికి ఆమె కూడా గదిలోకి వెళ్లి చనిపోయింది. ఆతర్వాత మేరియా కూడా నడుచుకుంటూ కిందికి వెళ్లింది. పాపను చూసిన మేరియా తల్లి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. తల్లిని చూసిన మేరియా గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. మేరియా తల్లి అతికష్టం మీద తలుపు లాక్ చేసింది. దీంతో మేరియా ఒక్కతే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.

అయితే ఈ చావులన్నింటికీ కారణం బంగాళదుంపలు. అవి నిల్వ ఉంచిన గదిలోకి వెళ్లిన వారంతా ఎందుకు వెంటనే చనిపోతున్నారో ఆ తర్వాత విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. బంగాళదుంపలను ఎక్కువ కాలం మూసి ఉన్న గదిలో నిల్వ ఉంచడం వల్ల అవి పాడైపోయాయని తేలింది. బంగాళదుంపలను గాలి కూడా చొరబడని గదిలో నిల్వ ఉంచితే అవి గ్లైకోలకాయిడ్స్ అనే విషపూరిత రసాయానాన్ని విడుదల చేస్తాయని తెలిసింది. ఈ రసాయనం కలిసిన గాలిని పీల్చుకుంటే నిమిషాల వ్యవధిలోనే మనుషులు చనిపోతారని డాక్టర్లు చెప్పారు. నైట్ షేడ్ అనే విషపూరిత మొక్క కూడా ఈ రసాయనాన్ని విడుదల చేస్తుందని తెలిపారు. ఈ విషపూరిత రసాయనంతో కూడిన గాలిని పీల్చుకున్నందు వల్లే మేరియా కుటుంబమంతా చనిపోయారని తేల్చేశారు. ఈ గదిని ఒకప్పుడు వంటగదిగా వాడేవారని, ఆ తర్వాత స్టోర్ రూమ్ గా మార్చారని తెలిసింది.

ఇది కూడా చూడండి: రణబీర్ తో హద్దు దాటేసిన ఐష్(వీడియో)

ఇది కూడా చూడండి: 30 ఏళ్ల తర్వాత బిగ్ బి సారీ చెప్పాడు.. ఇంతకీ ఏ తప్పు చేసాడట

English summary

Total Family Is Wiped Out Caused By Potatoes