హవ్వా... ఎనిమిదేళ్ళకే లవ్వా...

Touching love story

12:20 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Touching love story

ఆడుకునే వయస్సులో పిల్లలు ప్రేమ, పెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది మీకు ? లాగిపెట్టి ఒకటి దవడమీద ఇచ్చి, వెధవ ఇలాంటి వేషాలు వేసావో చమడాలు వలిచేస్తా అంటారు కదూ... కాని ఇక్కడ అలా జరగలేదు ఎనిమిదేళ్ళ పిల్లాడు తన ప్రేమ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్తే ఓకే అన్నారట.

వివరాల్లోకి వెళితే అమెరికాకి చెందిన డేవిడ్‌ స్పీశాక్‌ ఎనిమిదేళ్ళ బాలుడు. ఇతడు ఐలా అనే ఏడేళ్ళ చిన్నారిని ప్రేమిస్తున్నట్లుగా వాళ్ళ ఇంట్లో చెప్పాడు. దాంతో వాళ్ళు సంతోషంగా ఫీల్‌ అయి ఓకే అన్నారు. ఇదేంటి ఇంత సింపుల్‌ గా ఒప్పుకున్నారు అనుకుంటున్నారా....

అందులోనే ఉందండీ అసలైన రహస్యం. పాపం డేవిడ్‌ కి క్యాన్సర్‌ చివరి స్టేజ్‌లో ఉంది, ఇక ఎక్కువ రోజులు భ్రతకడని తెలియడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ చివరి రోజుల్లో తన కుమారుడు సంతోషంగా అన్నీ తనకి నచ్చినట్లు చెయ్యాలని వారు అభిప్రాయ పడ్డారు. దాంతో డేవిడ్‌ తన లవ్‌ విషయాన్ని చెప్పగానే వాళ్ళు ఇవేం ఆలోచించకుండా ఓకేఅన్నారట. తర్వాత ఐలా వాళ్ళ తల్లి దండ్రులను సంప్రదించారు డేవిడ్ పేరెంట్స్. దీనికి ఐలా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో వారిరువురు ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారు. డేవిడ్‌ తన ప్రియురాలు గురించి పొగుడుతూ తనది మంచు లాంటి మనస్సు అందుకే స్నోవైట్‌ రంగులో ఉంటుంది అని అంటున్నాడు ఆ బుల్లి లవర్ బాయ్.

ఐలా తల్లి ఏంజిలా, డేవిడ్‌ తల్లి ఏంబర్‌ వీరు ఇరువురు ప్రత్యేకమైన వారు మంచి మనస్సుతో వీరు ఇరువురి ప్రేమను అంగీకరించారు. ప్రేమ ఒక తియ్యని అనుభూతి అది తన కొడుకు కూడా అనుభవించాలని డేవిడ్‌ తల్లి ఆశపడింది. డేవిడ్ చివరి వరకు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారు. అందుకే డేవిడ్‌ తల్లి దండ్రులు చికిత్సని ఆపేసి తనకి ఒక సాధారణమైన జీవితాన్ని ప్రసాదించారు.

English summary

Touching love story. David Spisak eight years old boy. He loves Ayla she is seven years girl.Those parents are accept their innocent Love. He suffering from cancer.