షాకింగ్: స్మార్ట్ ఫోన్ బ్యాటరీలో విష వాయువులు!

Toxic gas in smart phone batteries

11:54 AM ON 24th October, 2016 By Mirchi Vilas

Toxic gas in smart phone batteries

ఇంచుమించు ప్రతి చేతిలో సెల్... కాదు స్మార్ట్ ఫోన్... అయితే దీన్ని వాడడం ఎలా వున్నా బ్యాటరీ విషయంలో జర భద్రం అంటున్నారు. ఎందుకంటే, మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బాగా వేడెక్కుతోందా? అయితే, జాగ్రత్త! స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల నుంచి వంద రకాల ప్రాణాంతక విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందట! ముఖ్యంగా బ్యాటరీ బాగా వేడెక్కినప్పుడు లేదా స్వల్పంగా దెబ్బతిన్నప్పుడు దాని నుంచి విష వాయువులు వచ్చే ముప్పుందని చైనా, అమెరికా శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ఈ బ్యాటరీల నుంచి ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడుతుందని, కార్లలో, చిన్న చిన్న గదుల్లో ఉన్నప్పుడు ఈ వాయువు విడుదలైతే ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు.

వేలాది బ్యాటరీల పనితీరును పరీక్షించగా.. సుమారు 20వేల బ్యాటరీలు పేలిపోయేంత స్థాయిలో వేడెక్కాయని, దాదాపు అన్నింటి నుంచీ విషవాయువులు విడుదలైనట్లు పేర్కొన్నారు. బ్యాటరీ 50శాతం ఛార్జ్ తో ఉన్నప్పుటికన్నా.. పూర్తిగా ఛార్జ్ లో ఉన్నప్పుడే ముప్పు ఎక్కువన్నారు. ఈమధ్య కొన్ని బ్యాటరీలు వేడెక్కి సెల్ ఫోన్లు కాలిపోవడం పేలిపోవడం చూస్తూనే వున్నాం కదా. అందుకే జాగ్రత్త!

English summary

Toxic gas in smart phone batteries